Mantrakavatam Teriste Mahabharatam Mana Cheritre|మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే

Mantrakavatam Teriste Mahabharatam Mana Cheritre|మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే

  • ₹650.00

ప్రతి ఒక్కరూ చదవాల్సిన అసాధారణ రచన!

పదండి చరిత్రలోతుల్లోకి... పదండి తోసుకు!

మహాభారతమూ, అందులోని పాత్రలూ, అవి ఎదుర్కొన్న సమస్యలూ, సంక్షోభాలూ తమను కప్పిన మాంత్రికశైలిని ఛేదించుకుంటూ నేరుగా చారిత్రకవాస్తవికతలోకి ప్రవహిస్తే - ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది!

ఆ అద్భుతత్వాన్ని ఈ పుస్తకంలోని అక్షరక్షరంలో మీరు ఆస్వాదించవచ్చు.

మహాభారత మంత్రకవాటం తెరచి చూపించే పురాప్రపంచాన్ని అంతే ఆశ్చర్యావహంగా దర్శించవచ్చు. భారతీయ, ఇతర ప్రపంచపౌరాణికతల మధ్య సాదృశ్యాలనే కాదు; విశ్వాసాలు, ఆచారాలు, సంస్కృతీసంప్రదాయాల రూపంలో మనం ఊహించుకునే హద్దులు చెరిగిపోయి, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయే విలక్షణ సన్నివేశాన్ని విప్పారిన చూపులతో వీక్షించవచ్చు.

సాహిత్య విమర్శకుడిగా, పత్రికారచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, కథా రచయితగా తెలుగు పాఠకులకు పరిచితులైన కల్లూరి భాస్కరం విశిష్ట రచన ఇది.

పురాచరిత్ర, సామాజికతలకు సంబంధించిన అనేకానేకమైన అదనపు కోణాల నుంచి మహాభారతాన్ని వ్యాఖ్యానించే ప్రణాళికలో పూర్వభాగం ఈ పుస్తకం.

ధారావాహికగా వెలువడి అశేషపాఠకులను అలరించిన ఈ రచన, మరిన్ని చేర్పులతో మరింత లోతును సంతరించుకుని ఇప్పుడీ గ్రంథ రూపంలో మీ చేతుల్ని అలంకరిస్తోంది.

మహాభారతంలోని మన చారిత్రక మూలాలను తవ్వి తీసే ఈ అసాధారణ రచన మలిభాగం రూపుదిద్దుకొంటోంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Mantrakavatam Teriste Mahabharatam Mana Cheritre, మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే, కల్లూరి భాస్కరం, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, Kalluri Bhaskaram, 9789393056290