Srimadramayanamu-10 Books|శ్రీమద్రామాయణము-10 సంపుటాలు

Srimadramayanamu-10 Books|శ్రీమద్రామాయణము-10 సంపుటాలు

  • ₹5,150.00

ఈ పుస్తకం చాలా బరువు ఎక్కువగా వున్నది అయినందున రవాణా చార్జీలు కూడా ఎక్కువ. పుస్తకం ధరలో ఈ చార్జీలు కూడా కలిపాము. గమనించగలరు.

వాస్తవ ధర 4950 రూపాయలు. రవాణా 200 కలిపితే 5150 రూపాయలు. 

శ్రీమద్రామాయణము - టీకా తాత్పర్య వ్యాఖ్యాన విశేషాదులతో

‘రామాయణము’ భారతీయ వాఙ్మయమునకు తలమానికమై, ఆదికావ్యమని ప్రసిద్ధినొందిన మహోత్తమగ్రంథము. సర్వకాలములందు సకలజనులకు పుణ్యశ్లోకుడగు శ్రీరాముని చరిత్రము శ్రీరామచంద్రుని సత్యశీలుడగు సంస్మరణీయము, అనుసరణీయము.

ఉత్తమచరిత్రను, మహాపతివ్రతయగు సీతాదేవి పవిత్రచరితమును కూర్చి, ఆదికవి వాల్మీకి రామాయణ కావ్యమును రచించుటచే అజరామరుడైనాడు. సరళము, సరసము, మనోజ్ఞమగు రామాయణశైలి సంస్కృతజ్ఞులగు పండితులనేగాక జిజ్ఞాసువులగు సామాన్యులను కూడా రంజింపజేయుచున్నది.

శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని ఆబాలగోపాలానికి అందుబాటులో ఉండే భాషలో మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడుగారు అందించిన బాలానందినీ వ్యాఖ్యాసహితంగా ఆర్ష విజ్ఞాన ట్రస్టు తొలిప్రచురణగా వెలువరించినారు.


మహామహోపాధ్యాయ డా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రప్రదేశ్ లోని, తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో 24/10/1927 జన్మించారు. తండ్రిగారైన శ్రీ సత్యనారాయణ శాస్త్రి గారి వద్ద కావ్యనాటక సిద్ధాంత కౌముద్యాదుల అధ్యయనం చేసి, శ్రీ కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి గారి వద్ద వ్యాకరణ వ్యాఖ్యాన గ్రంథాదులను అధ్యయనం చేశారు. మద్రాసు సంస్కృత కళాశాలలో వేదాంత శిరోమణి పరీక్షకు సంబంధించిన వేదాంత శాస్త్రాది గ్రంథాల అధ్యయనం చేసి శిరోమణి పరీక్షలో మద్రాసు విశ్వవిద్యాలయ సర్వప్రథములుగా ఉత్తీర్ణులైనారు. మద్రాసు విశ్వవిద్యాలయము నుండి తెలుగు విద్వాన్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి సంస్కృతము యమ్.ఏ; ఇంగ్లీషు యమ్.ఏ; హిందీ యమ్.ఏ. పరీక్షలలో ఉత్తీర్ణులై ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి జగన్నాథ పండితరాయల అలంకారశాస్త్ర ప్రావీణ్యము” అను విషయముపై పి.హెచ్.డి. ఉపాధి సంపాదించారు. 39 సంవత్సరములు పాఠశాల కళాశాల – విశ్వవిద్యాలయాలలో సంస్కృతాధ్యాపకులుగా పనిచేశారు.

ఆర్ష విజ్ఞాన ట్రస్టు

సర్వమానవజాతి హితం కోసం తపస్సు చేసి పరమ సత్యాలను దర్శించి, లోకానికి అందించిన మహాత్ములను ఋషులు అంటారు. ఋషి అంటే వేదమని కూడ అర్ధం. ఋషులు మానవసముదాయానికి ఇహపర సుఖాల కోసం ఏర్చి తీర్చి కూర్చి పెట్టిన విజ్ఞానం అనంతంగా ఉంది. వేదమంత్రాలలో, దర్శనాలలో, ఇతిహాస పురాణాలలో, స్మృతి గ్రంథాలలో అది నిక్షిప్తమై ఉంది. న్యాయమూర్తి, యశఃకాయులు శ్రీ పమిడిఘంటం కోదండరామయ్య గారు భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం భాగ్యనగరములో ‘ఆర్ష విజ్ఞాన ట్రస్టు’ అనే ధార్మిక వ్యవస్థను నెలకొల్పి రామాయణభారతభాగవతాదులను విద్వద్వరేణ్యుల వ్యాఖ్యానాలతో అలంకరించి తెలుగుపాఠకలోకానికి అందించారు. ప్రపంచం నలుమూలలా వ్యాపించి ఉన్న తెలుగు పాఠకలోకం వారికి సర్వదా కృతజ్ఞతాబద్ధమై ఉంటుంది.

జస్టిస్ శ్రీ పమిడిఘంటం కోదండరామయ్య గారు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Srimadramayanamu, శ్రీమద్రామాయణము, ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు, Dr. Pullela Sriramachandrudu, Arsha Vignana Trust, ఆర్ష విజ్ఞాన్ ట్రస్ట్