Aaharampai Aankshalaa? | ఆహారంపై ఆంక్షలా?

Aaharampai Aankshalaa? | ఆహారంపై ఆంక్షలా?

  • ₹200.00

జీవన ప్రమాణం, మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో ఇంకా 135వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా అభివృద్ధి చేయాలని, ప్రపంచ దేశాలలో మొదటి 10లో స్థానం పొందాలని ఉరకలు వేస్తున్న దశలో యువతలో ఆహార పదార్థాల విషయంలో వైషమ్యాలను మళ్లించడం అత్యంత విచారకరం.

ఒక పదార్థం తినదగినదా? కాదా? ఎవరు నిర్ణయిస్తారు? పూజారులా? బాబాలా? రాజకీయ నాయకులా? అనే అంశంపై చక్కటి చర్చ ఇందులో ఉంది. ఏమి భుజించాలో, ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏమి చదవాలో, ఎవరిని ప్రేమించాలో అనే విషయాలు వ్యక్తిగతమైనవి. తమకిష్టమైన ఆహారం భుజించినందుకు తోటి మానవులను ద్వేషించి, అవమానించి, హింసించే అమానవీయ పోకడలను ఈ పుస్తకం తూర్పారబడుతుంది. దేశంలో ఉన్న గొప్ప పశుసంపదను శార్సఈ్తయ కోనంలో వినియోగించుకోలేక పోవడం వెనకబాటుతనానికి ఒక ముఖ్య కారణంగా ఈ పుస్తకం నిరూపించింది.

20 అధ్యాఆలతో అనేక పట్టికలు, చిత్రాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. కొత్త కోణంలో పరిశోధన సాగిస్తూ పాఠకులను ఆలోచింపజేసే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. అనేక ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలను విశ్లేషించింది. మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా పాఠకులను అలరింపజేస్తుంది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Tenneti Jayaraju, తెన్నేటి జయరాజు, Aaharampai Aankshalaa?, ఆహారంపై ఆంక్షలా?, Visalandhra Publishing House, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్