Okka Vaana Chalu | ఒక్క వాన చాలు

Okka Vaana Chalu | ఒక్క వాన చాలు

  • ₹110.00

ఈ నవల రాయటంలో రెండు ఉద్దేశాలున్నాయి.

రాయలసీమ రైతు, రైతుకూలీల బతుకులు ఇప్పుడు వలస బతుకులయ్యాయని చెప్పటం ఒకటైతే -

రెండవ విషయం ఏమిటంటే - ఎన్ని కష్టాలు వెంటాడుతూవున్నా ఏడుస్తూ కూచోవటం ఇక్కడి మనుషుల లక్షణం కాదు. ఎంత ఆకలేసినా చేతులు చాచి అడుక్కోవటం ఇక్కడి రైతులకు అలవాటు లేదు. నిరంతరం బతికేందుకే పోరాడుతుంటారు. బండరాతి మీద అయినా సరే పిడికెడు అన్నం పుట్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. చెతుర్లాడుకోవటంలో ఆకలిని మరుస్తారు. బూతు పదాలు కలిసిన మాటలతో హాస్య సంఘటనలు చెప్పుకొంటూ నవ్వుకొంటూ కష్టాలు మరవటానికి ప్రయత్నిస్తారు. సద్ది సెరవలో పుల్లనీళ్ళ మీద తేలే పచ్చిమిరపకాయ మీద కూడా జోకులేసుకుంటూ దుర్భరమైన ఆ తిండినే కడుపారా తిని పనికి పోగలరు. బీడీకట్టకు లెక్కలేనంత దరిద్రంలో వుండికూడా ఒకే బీడీని నలుగురు పంచుకు తాగుతూ తమ దరిద్రం మీద తామే జోకులేసుకోగలరు.

ఇక్కడి రైతు కరువుకు అలవాటు పడ్డాడు - ఆఇకలికి లాగే నాయకుల వాగ్థానాలకు అలవాడు పడ్డాడు - వట్టి మేఘాల ఉరుములకు లాగే.               - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, Sannapureddy Venkata Rami Reddy, Okka Vaana Chalu, ఒక్క వాన చాలు, Visalandhra Publishing House, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్