Sarada Sahityam | శారద సాహిత్యం

Sarada Sahityam | శారద సాహిత్యం

  • Author: శారద | Sarada
  • Pages: 400
  • Year: 2020
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • Publisher: Arasam-అరసం
  • ₹225.00

కథలు * గల్పికలు * లేఖలు

Kathalu * Galpikalu * Lekhalu

తెలుగు సాహిత్యంలో'శారద'కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దురదృష్టమేమంటే, 'శారద'అంటే చాలా మందికి తెలియదు. ఆ మహనీయుని గురించిన చిన్నపరిచయమే ఈ వ్యాసం. యస్.నటరాజన్ అనే వ్యక్తి 'శారద'గా మారటం వరకు ఆయన జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. ఆలూరి భుజంగరావు వ్రాసిన సాహిత్య బాటసారి--'శారద' అనే జీవిత చరిత్రలో, 'శారద'ను గురించిన కొన్ని విశేషాలను వ్రాసాడు.

తొలిసారిగా ఆయన వ్రాసిన వ్యంగ్య రచన 'ప్రపంచానికి జబ్బుచేసింది'. ఇది 1946 లో ప్రజాశక్తి పత్రికలో ప్రచురించబడింది. ఆ రచన వారి సొంత పేరైన యస్.నటరాజన్ పేరు మీదే అచ్చయింది. ఆ రోజుల్లోనే, ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు. ఆ తరువాత 'చంద్రిక'ను మొదలు పెట్టారు. అయితే, వాటిని అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక స్తోమత లేకపోవటం వల్ల ఎక్కువకాలం కొనసాగించ లేకపోయారు. 1948 నుండి1955 వరకు అంటే ఏడేళ్ళు మాత్రమే రచనలు చేశారు. తెలుగు స్వతంత్ర, జ్యోతి, హంస వంటి పత్రికలు ఆయనకు మంచి ఊతమిచ్చాయి. ప్రస్తుతం, రక్తస్పర్స, శారదరచనలు, శారద నవలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా, 'శారద' అభిమానుల పూనికవల్లనే వెలుగు చూశాయి. శారద, రావూరి భరద్వాజలు దాదాపుగా ఒకే సమయంలో రచనలను ప్రారంభించారు. ఇద్దరి మీదా చలం గారి ప్రభావం పూర్తిగా ఉంది. శారద జీవితమంతా దరిద్రంతోనే గడిచింది. ఒక చేత్తో, గారెలు చేసి అమ్ముతూ, మరో చేత్తో 'మంచి-చెడు' అనే నవలను వ్రాశారు. ఎంత దుర్భర పరిస్థితులు ఎదురైనా రచనా వ్యాసంగాన్ని మానలేదు. ఇక అతని శైలి చాలా భిన్నమైనది. ఎంచుకునే కథా వస్తువు విభిన్నంగా ఉండేది. ఈ రెండు లక్షణాలే శారదను తెలుగు సాహితీలోకంలో విశారదుడిగా నిలబెట్టాయి."కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్త్రి గార్ల రచనలకు వారధి వంటి వాడు శారద" అని ఆ రోజుల్లోనే సాహితీ ప్రియుల మన్ననలను పొందాడు శారద. కార్మిక ఉద్యమాలతో సంబంధమున్న ఈయన రచనలలో, కార్మికుల జీవనవిధానం కనపడేది. కమ్యూనిస్టు పార్టీలో గుర్తింపు పొందిన కార్యకర్త. ఇంతటి సాహితీ సుసంపన్నుడైన 'శారద' దుర్భర దారిద్ర్యంతో, మూర్ఛవ్యాధితో, 17-08-1955 న, తన 31 ఏటనే శాశ్వతనిద్రలోకి జారుకున్నాడు. ఇదీ, 'శారద నీరదేందు ఘనసార' కన్నీటి కథ. నటరాజన్ అనే తమిళ యువకుడు 'శారద'గా మారిన నిజమైన కథ. 'శారద'జీవితం మరో సత్యాన్ని చెబుతుంది--కష్టాల కొలిమినుండే ప్రజలకు ఉపయోగపడే సజీవ సాహిత్యం ఉద్భవిస్తుంది. ఆకలిదప్పులు, దారిద్ర్యంఅతనిని భౌతికంగా బాధపెట్టాయేమో కానీ, అతనిలోని సాహితీ పిపాసను అంటుకోవటానికి, అడ్డుకోవటానికి కూడా అవి భయపడ్డాయి. కేవలం అతను ఒక రచయితే కాదు, తత్వవేత్త, క్రాంతదర్శి, దార్శనికుడు. తెనాలిలో ఆయన స్మారకచిహ్నాలు లేకపోవటం చాలా విచారకరం. ఆ మహనీయుని ఫోటో కోసం, నా దగ్గరవున్న ఆయన నవలనొక దానికోసం వెదికాను.ఆ నవల వెనకవైపు అట్టమీద ఆయన ఫోటో ఉంది. ఆ నవల కోసం ఎంత వెదికినా కనబడలేదు. "మంచి పుస్తకాలకు రెక్కలు వచ్చి ఎగిరి పోతాయి" అన్న నార్ల వారి మాటలు నిజమే కాబోలు. ఎవరైనా ఆయన ఫోటోను పంపితే ఆనందిస్తాను. తెలుగువారికి మంచి కథలను అందచేయటానికే ఆంధ్రదేశానికి వచ్చిన ఈ విశారదుడికి బాష్పాంజలి!

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Sarada Sahityam, శారద సాహిత్యం,