Paravasa | పరవశ - మానస చామర్తి కవిత్వం
- Author:
- Pages: 116
- Year: 2022
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Analpa Book Company-అనల్ప బుక్ కంపెనీ
-
₹150.00
పరవశ
మానస చామర్తి కవిత్వం
చీకటి విప్పిన వెలుగుల మూటలు
చూడలేని వాళ్లంతా వాదించుకుంటారు,
ఆకాశమూ అర్ణవమూ
ఏనాటికైనా ఎలా కలుస్తాయని.
---
బయట అదే ముసురు.
అదే గాలి, లోపల గుబులూ
గిలిగింతా
----
ఉండచుట్టుకు పడిపోయిన వేల కాగితాల లోపల
ఎవరికీ ఎన్నటికీ చేరని భావంలా,
నాలోపల,
నువ్వలాగే!
----
ఆకాశమంతా
కెంజాయ మెరుపులు
చెక్కిలి గిల్లి నవ్విందెవ్వరు?
---
శరన్మేఘం తన తెలుపుచీరను
ఆకాశం మీద ఆరేసుకుంటుంది
వెన్నెల వలువల్లో తాను వెలిగిపోతూ
నల్లబడ్డ నన్ను చూసి నవ్వుకుంటుంది
Tags: Paravasa, పరవశ, మానస చామర్తి కవిత్వం, అనల్ప, 9789393056016