aAshada Goutami-Residency|ఆషాడ గౌతమి-రెసిడెన్సీ
- Author:
- Pages: 256
- Year: 2023
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Telugu Print-తెలుగు ప్రింట్
-
₹275.00
Ashada Goutami-Residency|ఆషాడ గౌతమి-రెసిడెన్సీ
ఆషాడ గౌతమి---- అది 1885వ సంవత్సరం! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు ఈస్టిండియా కంపె పెనీవారు, భారతదేశాన్ని పాలననే నెపంతో కబళిస్తున్న రోజులు. పరదేశీయుల పాలనను తిరస్కరిస్తూ స్వాతంత్ర్యమనే దేశభక్తి భావాలు భారతీయుల్లో నిప్పురవ్వల్లా రగుల్కొంటున్న రోజులు! అటువంటి రోజుల్లో చదువు సంస్కారం, వివేకం, విజ్ఞానం గల అండర్సన్ అనే దొర అమలాపురం తీరాన్ని పాలించడానికి వచ్చి... చదువు సంస్కారం, వివేకం, విజ్ఞానం లేని ఒక కోయపిల్లను ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. కానీ... తన మాతృభూమికన్న గొప్పది, దేశ భక్తికన్న మిన్నయెనది ప్రేమ. కాదు “దేశభక్తి అంటూ అతనికి జ్ఞానోదయం చేసింది. జ్ఞానోదయమైన ఆ దొర ఏం చేశాడు? అప్పుడప్పుడే భారతీయుల్లో రగులుకుంటున్న నిప్పురవ్వలు ప్రచండవేగంతో పయనించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాయా లేదా? - పాలు-తేనె కలిసిన మాదిరిగా, ప్రేమను -దేశభక్తిని కలిపి మధురాతిమధురంగా రచించిన రచన యిది!
రెసిడెన్సీ--- నేడు తెలంగాణా అని పిలువబడే ప్రాంతాన్ని పూర్వం అసఫ్జాహీ రాజవంశస్థులు పరిపాలించారు. వారికి రక్షణగా ఆంగ్లేయులు సైనిక సహకార పద్ధతి ఇడంబడికలో భాగంగా తమ రెసిడెంట్ అకిలెస్ను హైదరాబాదు పంపించారు. అతడు నివసించిన రాజప్రసాదం పేరే రెసిడెన్సీ (కోఠీ). ఇతడు ఖైరున్నీసా అనే మహా సౌందర్యవతి ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఐతే ఇది ఆనేక సమస్యలకు దారి తీసింది. మరుగున పడిన ఈ మహేతిహాసాన్ని చారిత్రక నవలా చక్రవర్తి ఆద్యంతం ఉత్కంఠతో ఒక గద్య కవితా ప్రబంధమా అన్నట్లు తీర్చిదిద్దారు. తెలుగు భాషలోనే కాదు మరే ఇతర భారతీయ భాషలలో కూడా ఈ ప్రణయ వృత్తాంతంపై ప్రామాణిక చారిత్రక నవల ఇంతవరకూ రాలేదు.