Kahlil Gibran Rachanalu | ఖలిల్ జిబ్రాన్ రచనలు

Kahlil Gibran Rachanalu | ఖలిల్ జిబ్రాన్ రచనలు

  • ₹120.00

    ₹150.00

ద వాండరర్, ద వాండరర్, ద శాండ్ అండ్ ఫోమ్, ద మాడ్ మాన్, ద ఫోర్ రన్నర్

The Wanderer, The Sand and Foam, The Madman, The Forerunner

అనువాదం:  కె. బి. గోపాలం |  K B Gopalam

జిబ్రాన్ రచనలలో విలియం వర్డ్స్ వర్త్, కీట్స్, బ్లేక్ ల ప్రభావం కనబడుతుంది. అక్కడక్కడ థోరో, ఎమర్సన్ లు కూడా స్ఫుటంగా తొంగి చూస్తారు. ఈ విషయాలను ప్రపంచ స్థాయిలో సాహిత్యకారులందరూ చర్చించారు. ఇవాళటికి జిబ్రాన్ రచనలను గురించి ప్రసంగాలు, పరిశీలనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభావాల సంగతి ఎట్లా ఉన్నా, జిబ్రాన్ తనదంటూ ఒక కళాధోరణిని, రచనా ధోరణిని సిద్ధం చేసుకున్నాడు. ఈ ధోరణి ప్రభావాలు తరువాతి కవుల మీద కనిపించాయని చెప్పడానికి వీలులేనంత వింత దారులలో జిబ్రాన్ రచనలు నడిచాయి. అతని మామూలు మాటలలో కూడా కవితా ధోరణి బలంగా కనిపిస్తుంది. ఇక కవిత రాస్తే అది చాలా లోతుగా ఉంటుంది.

జిబ్రాన్ రచనలు విస్తారమయినవి కావు. కానీ వాటి ప్రభావం మాత్రం చాలా విస్తారమయినది. రచనలు చేసిన కాలాన్ని బట్టి చూస్తే ఒక విచిత్రమయిన పధ్ధతి కనిపిస్తుంది. అందులో క్రమం మాత్రం అనుకున్నట్టు కనిపించదు. ఇవాళ ప్రపంచంలో జిబ్రాన్ పేరు చెప్పగానే ముందుగా అందరూ ప్రాఫిట్ గురించి చెపుతారు. ఈ పుస్తకాన్ని తెలుగులోకి కూడా ఒకటి కన్నా ఎక్కువసార్లే అనువాదాలు చేశారు. అయినా దాని గురించి జరగవలసినంత చర్చ జరగనేలేదు అనవచ్చు.

మీరు ఈ పుస్తకాన్ని చేతికి ఎత్తుకున్నందుకు ధన్యవాదాలు. ఏ పేజీ అయినా సరే విప్పి చదవడమ మొదలు పెట్టండి. మీరు మరింత ముందుకు చదువుతారని, నాలాగే ఆలోచనలో పడతారని, ఖలిల్ జిబ్రాన్ ను అభిమానిచడం మీకు తప్పదని మనసారా భావిస్తున్నాను. ఖలిల్ జిబ్రాన్ లాంటి మహనీయుని మాటలను తెలుగులో పుస్తకంగా అందించడం వెనుక ఉన్న వారందరికీ, రుణపడి ఉంటాను. చదివి ఆనందించిన వారికి మరింతగా రుణపడి ఉంటాను.- కె.బి.గోపాలం

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Kahlil Gibran Rachanalu, ఖలిల్ జిబ్రాన్ రచనలు, కె. బి. గోపాలం, K B Gopalam, ద వాండరర్, ద వాండరర్, ద శాండ్ అండ్ ఫోమ్, ద మాడ్ మాన్, ద ఫోర్ రన్నర్, The Wanderer, The Sand and Foam, The Madman, The Forerunner