చదివి ముగించిన తర్వాత ఆలోచనను రగిలించేది మంచి కథకు ఉండవలసిన ముఖ్యలక్షణం. ఈ సంపుటంలో కథలు పెక్కింటికి ఈ మాట అనువర్తిస్తుంది. రచయిత డా. కొప్పరపు నారాయణమూర్తికి జీవిత సమస్యల పట్ల సరైన అవగాహన ఉంది.
మధురాంతకం రాజారాం, సుప్రసిద్ధ రచయిత
స్త్రీ జాతి పక్షాన ధిక్కార స్వరాన్ని వినిపించిన నారాయణమూర్తి చైతన్యాన్ని తెలుగు కథా లోకం తప్పక గుర్తిస్తుందని ఆశిస్తున్నాను. గుర్తించాలి, గౌరవించాలి. (ముఖ్యంగా స్త్రీవాదులు). ...(మలుపు కథలో) చలం కన్నా ఒక అడుగు ముందుకు వేశారు నారాయణమూర్తి.
పెనుగొండ లక్ష్మీనారాయణ, అధ్యక్షులు, అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం