Mana Sangeeta Sikharalu | మన సంగీత శిఖరాలు
- Author:
- Pages: 2008
- Year: 2011
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Creative Links Publications-క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్
₹120.00
₹150.00
చాగంటి కపాలేశ్వరరావుగారు కాకినాడ మెక్లారిన్ హైస్కూల్లో మెట్రిక్యులేషన్ చదువుకున్నారు. బాల్యం నుంచే సంగీతంలో అభిరుచి కలిగి పాట విన్నవెంటనే సొంతంగా ఆ పాటను పాడగలిగేవారు.
కాకినాడ సరస్వతీ గానసభ నిర్వహించే సంగీతోత్సవాల్లో మహామహుల సంగీత కచేరీల శ్రవణం, నూకలవారితో సన్నిహిత మైత్రి, వోలేటి వెంకటేశ్వర్లు వారి విజయవాడ ఆకాశవాణి సంగీత శిక్షణ ఆయనకు కృతి సంపదనందించింది. నేదునూరి వారి ప్రోత్సాహంతో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గాత్ర సంగీత డిప్లొమా పొందారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన చాగంటివారు, సంగీతంలోనే కాక బాల్యం నుంచే ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ప్రావీణ్యం సంపాదించి ప్రముఖ పత్రికల్లో వ్యాసాలు వ్రాసి ప్రసిద్దుల మన్ననలు పొందారు.
సాహిత్యంలో కూడా తనకున్న అభిరుచితో శ్రుతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ క్రానికల్ వంటి మేటి దిన, వార, మాస పత్రికల్లో సంగీత, సాహిత్య సమీక్షకులుగానూ, విమర్శకులుగానూ, కాలమిస్టుగానూ పొలిటికల్ సెటైరిస్ట్‌గానూ 50 ఏళ్ళకు పైగా సంగీతానికి, సాహిత్యానికి విశేష కృషి సల్పి పలువురు ప్రముఖుల మరియు గొప్ప కళాకారుల మన్ననలు పొందారు. ఎంతో మంది యువ కళాకారులను పరిచయం చేసి వారికి మంచి భవష్యత్తు కల్పించడంలో కారణభూతులైనారు. ఆయన సంగీత సమీక్షల సంకలనం ఒక సంగీతశాస్త్ర పాఠ్యగ్రంథం అవుతుంది.
Tags: Mana Sangeeta Sikharalu, మన సంగీత శిఖరాలు, చాగంటి కపాలేశ్వరరావు, Chaganti Kapaleswararao