Partylo Padamugguru | పార్టీలో పదముగ్గురు

Partylo Padamugguru | పార్టీలో పదముగ్గురు

  • ₹120.00

    ₹150.00

అనువాదం: కె.బి. గోపాలం | K.B.Gopalam

ప్రపంచ అపరాధ పరిశోధన సాహిత్యంలో అందరికన్నా ముందు వినిపించే పేరు ఆగదా క్రిస్టీ. అమె పుస్తకాలు ఇప్పటికి ఎన్ని పుస్తకాలు అచ్చయినయి? అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టం అంటున్నారు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ ప్రతులు అచ్చయిన పుస్తకం బైబిల్. ఆ తరువాత స్థానం షేక్‌స్పియర్ నాటకాలది. ఇక ఆగదా రాసిన నవలలు, కథాసంకలనాలను అన్నింటినీ కలిపితే మూడవ స్థానం ఆమెదే అంటున్నారు. ఆ విజయం వెనుకనున్న రహస్యాన్ని ఆగదా స్వయంగా చెప్పారు. 'నేనేమీ మహత్తరమయిన సాహిత్యం సృష్టించలేదు. కేవలం సరదాగా సరదా కొరకు రాశాను' అన్నారు ఆమె. ఇంకేం, మీరు కూడా సరదాగా ఈ పుస్తకాన్ని చదివి ఆనందించండి.

అగదా క్రిస్టి తన రచనలలో హెర్క్యూల్ పోయ్‌రో, మిస్ మార్ప్‌ల్ అనే పెద్ద వయస్సు వ్యక్తులను డిటెక్టివ్‌లుగా వాడుకున్నారు. హెర్క్యూల్ పోయ్‌రో అన్ని రకాలుగాను విచిత్రమయిన వ్యక్తి. కేవలం అలోచన సాయంతో కేసులను విడదీస్తాను, అంటాడు. అతను బెల్జియంలో పోలీస్ ఆఫీసర్‌గా పనిచేసి పదవీవిరమణ చేశాడు. అలవాటుగా ఫ్రెంచ్ మాట్లాడతాడు. ఉండేది మాత్రం లండన్ నగరంలో. అతను పొట్టి, లావుపాటి మనిషి. టి.వి. ఎపిసోడ్స్‌లో డేవిడ్ సుషే అనే నటుడు ఈ పాత్రకు ప్రాణం పోశాడు.

ఇక ఈ నవలలో...

ఒక లార్డ్ హత్యకు గురవుతాడు. భార్య అతడిని చంపిందని అందరూ అనుకుంటారు. కానీ, ఆ సమయానికి ఆమె ఒక పార్టీలో ఉందని చాలామంది సాక్ష్యం చెపుతారు. పోయ్‌రో పరిశోధనల క్రమంలో ఇదొక చిత్రమయిన కేసు. ఇందులో తన ప్రమేయం లేదంటాడు అతను. దారిన పోయే ఎవరో అన్నమాట సాయంగా కేసు విడిపోయింది, అంటాడు. నిజంగానా! చదివితే మీకే తెలుస్తుంది. ఆద్యంతం సస్పెన్స్‌తో సాగే నవల మీ చేతిలో ఉంది.

ఇక మీ ఇష్టం!      - కె.బి. గోపాలం 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Partylo Padamugguru, పార్టీలో పదముగ్గురు, ఆగదా క్రిస్టీ, Agatha Christie, కె.బి. గోపాలం, K.B.Gopalam