Raja Ravivarma | రాజా రవివర్మ
- Author:
- Pages: 414
- Year: 2021
- Book Code: Hardcover
- Availability: In Stock
- Publisher: Kaaki Prachuranalu|కాకి ప్రచురణలు
-
₹450.00
రాజా రవి వర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతం లోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి.
ఈ నవల అతని కళాజీవితాల కలనేత. అతని రంగుల సంరంభాన్ని, బతుకులోని తీపిచేదులను ఇది అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఆధునిక భారతీయ కళలో రవివర్మ స్థానం చెరిగిపోనిది. అతన్ని పొగిడే వాళ్లు ఉన్నారు. విమర్శించే వాళ్లూ ఉన్నారు. విస్మరించే వాళ్లు లేరు.
భారతీయ కథలను అపూర్వంగా దృశ్యీకరించి, దేవుళ్లను రక్తమాంసాలతో పునఃసృష్టించిన కళాజీవి సాహసగాథ ఈ నవల. కుగ్రామంలో పుట్టిన రవివర్మ స్వయంకృషితో భారతీయ చిత్రకళాభూమిలో అనితరసాధ్యంగా వేసిన కొత్త బాటలోకి ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది. అతని చిత్రాలు రాజసౌధాలనే కాక పూరిగుడిసెలనూ అలకరించిన వైనాన్ని కళ్లకు కడుతుంది.
ఇది విజయగానం మాత్రమే కాదు. ‘రాజభవనంలో తిని కూర్చోవడం గొప్ప కాద’న్న రవివర్మ తన లక్ష్యసాధన కోసం భరించిన కష్టనష్టాలను, అవమానాలను, అశాంతిని కూడా ఇది పరిచయం చేస్తుంది. ప్రాక్పశ్చిమ నాగరకతలు, కళాసంప్రదాయాలు తలపడిన సంధికాలంలో ఒక సృజనశీలి తన లోపలా, బయటా చేసిన అరుదైన యుద్ధమే ఈ కథ. ఇందులో అతని రంగుల దీపపు వెలుగుతోపాటు దాని క్రీనీడా కనిపిస్తుంది.
ఈ నవల తెలుగు పాఠకులకు రవివర్మను సరికొత్తగా, అబ్బురంగా పరిచయం చేస్తుంది. విశాఖపట్నం, హైదరాబాద్‌లలో అతని బస విశేషాలూ ఇందులో ఉన్నాయి. అతని కవిత్వమూ పలకరిస్తుంది. రవివర్మకు నమ్మినబంటైన అతని తమ్ముడి కళాజీవితాలూ వెన్నంటి సాగుతాయి. కళాభిమానులకే కాక సాహిత్యప్రియులకూ ఇది వసంతోత్సవం!
రచయిత పి.మోహన్ పాత్రికేయుడు. పుట్టింది కడప జిల్లా ప్రొద్దుటూరులో. అచ్చయిన పుస్తకాలు.. కిటికీపిట్ట (కవిత్వం 2006), పికాసో (2010), డావిన్సీ కళ-జీవితం (2013).
Tags: రాజా రవివర్మ, పి. మోహన్, కాకి ప్రచురణలు