Kalibatalu Naa Swargadwaaralu | కాలిబాటలు నా స్వర్గద్వారాలు
- Author:
- Pages: X+284
- Year: 2017
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Batasari Books-బాటసారి బుక్స్
-
₹150.00
The Scholar Gypsy- M. Adinarayana
ఐదువేల కిలోమీటర్ల పాదయాత్రలు
తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది
పాదాలు పుట్టిందే ప్రయాణం కోసం. మనల్ని ఒక చోటు నుండి మరొక చోటుకి హాయిగా తీసుకెళ్ళే వాహనం మన పాదాలు. అడుగులో అడుగేసుకొంటూ ముందుకి సాగిపోతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటి ముందడుగులే మానవజాతి మనుగడకి మూలాలయ్యాయి. దేహమనే దేవాలయానికి పటిష్టమైన పునాదులు పాదాలే. నదుల ఒడ్డున ఏర్పడిన బాటల్లోనే మన పూర్వీకులు సాగిపోయారు. ఎండాకాలంలో వడగాలికి చెట్ల కొమ్మలు రాసుకొని, అగ్గిపుట్టి, అడవులు మండిపోయి కొత్తగా బాటలు ఏర్పడేవి. అలాంటి బాటలు మరిన్ని కావాలని అగ్నిని పూజించారు. ఆ విధంగా పథకృత్(బాటలు ఏర్పరచేవాడు) అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు అగ్నిదేవుడు. అప్పటి నుండి ఎక్కువగా బాటలు ఏర్పడి ఆర్యుల ప్రయాణాలు ఎక్కువయ్యాయి.
Tags: Kalibatalu Naa Swargadwaaralu, కాలిబాటలు నా స్వర్గద్వారాలు, ఎం. ఆదినారాయణ, M Adinarayana