Harikatha Bhikshuvu | హరికథా భిక్షువు
- Author:
- Pages: 200
- Year: 2018
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: SP Prachurana-శ్రీపతి పండితారాధ్యుల ప్రచురణ
-
₹200.00
శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారి జీవన దర్శనం
తనికెళ్ళ భరణి: ఋషి కానివాడు కావ్యం రాయలేడూ.. అన్నారు పెద్దలు! తపస్సు చేస్తేనే తప్ప కవిత్వం రాయలేడు అంటాను నేను. అలాగ తప్పస్సు చేస్తూ కవిత్వాన్నీ, కవిత్వం కోసమే తపస్సు చేస్తున్నవాడు ఎమ్మెస్ సూర్యనారాయణ. మనిషిలో ఉండే సర్వ లక్షణాలు, కొన్ని అవలక్షణాలు మూర్తీభవించినవాడు ఎమ్మెస్. ఎన్నో బలాలు కొన్ని బలహీనతలు. వాడి బలం – నిస్వార్థంగా ప్రేమించటం, బలహీనత – కుండబద్దలుకొట్టినట్టు చెప్పడం.. ఆ కుండల వల్లే వాడి జీవితం ఘటం వలె వాయించబడింది! ఏతావాతా వాడు సారవంతమైన కవి!! చాలా కవితలు రాసాడు. కొన్ని పుస్తకాలేసాడు. కొన్ని కథలు రాసాడు. కొన్ని ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి కూడా.
ఇప్పుడు ఇదిగో హరికథా భిక్షువు!
బాలుగారి తండ్రిగారైన సాంబమూర్తిగారి జీవనచిత్రణ ఇది. రసవంతమైన కావ్యంలాగ స్పూర్తిమంతమైన చరిత్రలాగా ఒక హరికథా కళాకారుడి కథ.. ఎంతో పరిశోధించి, ఎన్నో పరిశీలించి అంతకుమించి పరవశించి రాసిన గ్రంథం. ఏదో ఒక శుభ ముహూర్తాన ఎమ్మెస్ కి అలా నిపించింది. ఆరు నెలలకి ఇలా తయారైంది! దీనికి ఎంతోమంది మాట సాయం చేసారు. కొంతమంది బాట సాయం కూడా చేసారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఈ హరికథా బిక్షువుకి తంబురా లాంటివాడు. హృద్యంగా నేపథ్యంలో ఉంటాడు. ఇది చదివితే మనకి హరికథ మీద భక్తి పెరుగుతుంది. హరికథకుల మీద గౌరవం కలుగుతుంది! సాంబమూర్తి గారి ఆత్మకు అప్రయత్నంగానే నమస్కారం చేస్తాం! ఇది హరికథ చెప్పే గిరి కథ!
చదవండి!... తన్మయులు కండి!
శివోహం
Tags: Harikatha Bhikshuvu, హరికథా భిక్షువు, శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి అయ్యవారి జీవన దర్శనం, M.S.Surya Narayana, యం.యస్.సూర్యనారాయణ