Kathalu Tine Jadala Bhootam | కథలు తినే జడల భూతం

Kathalu Tine Jadala Bhootam | కథలు తినే జడల భూతం

  • ₹100.00

అక్బర్ - బీర్బల్ - నసీరుద్దీన్ కథలు

జి.వి.ఎల్‌.నరసింహారావు తెలుగు పాఠకులకు సులభమైన శైలిలో 'కథలు తినే జడల భూతం' పేరుతో 'అక్బర్‌-బీర్బల్‌', 'నసీరుద్దీన్‌' కథలను అందించారు. ఈ కథలు చదువుతుంటే మనకు సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపం కనిపిస్తుంది.

భారతదేశాన్ని సుమారు 500 ఏళ్ళ కిందట ఏలిన అక్బరు చక్రవర్తి ఆస్థానంలో పనిచేసిన మంత్రి 'బీర్బల్‌'. బీర్బల్‌ చాలా తెలివైనవాడు, సమయస్ఫూర్తి, హాస్య చతురత కలిగినవాడు. ఎన్నెన్నో చిక్కు సమస్యలనూ, కష్టమయిన ప్రశ్నలనూ ఆయన ఇట్టే పరిష్కరించేవాడు. అవన్నీ ఈ కథలలో మనకు కనిపిస్తాయి.

నసీరుద్దీన్‌ కథలు విశ్వవిఖ్యాతమైనవి. అజర్‌బైజాన్‌ జానపద గాథలలో తరచూ వినవచ్చే ఈయన పేరు ఎత్తితేనే ఏడు కథలు చెప్పాలని అక్కడి సామెత అట. ఈ కథల్లో కొన్నిచోట్ల మహా మేధావిలా, కొన్నిచోట్ల వెర్రిబాగులవాడిలా, విదూషకునిలా, వేరొకచోట గొప్ప తత్వవేత్తలా కనిపిస్తాడు నసీరుద్దీన్‌. పిల్లల హృదయాల్ని, పెద్దలకు తమ బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చి ఆనందింపచేసే కథలు ఇవి.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Kathalu Tine Jadala Bhootam, కథలు తినే జడల భూతం, అక్బర్, బీర్బల్, నసీరుద్దీన్ కథలు, జి.వి.యల్.నరసింహా రావు, G.V.L.Narasimha Rao