Khadga Srushti | ఖడ్గ సృష్టి
- Author:
- Pages: 241
- Year: 2008
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹150.00
తనకేది తోస్తే అది నిర్భయంగానే కాక సందర్భశుద్ధి కూడా పట్టించుకోకుండా మాట్లాడడం అటుంచితే శ్రీశ్రీ మాటల్లో ఒకవిధమైన శబ్దాలంకారాలు, చమత్కారాలు దొర్లుతూండేవి. చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ ప్రసిధ్ధి చెందాడు. అతను చెణుకులు ఎన్నో లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
- ఒక మారు గోరాశాస్త్రి శ్రీ శ్రీ తో,"శ్రీ శ్రీ! నువ్వేమిటన్నా అనుకో.నా ఉద్దేశం మాత్రం ఇది! ఈ నాడు ఇండియాలోని రచయితలందరికన్నా నేనే గొప్పవాణ్ని" అన్నాడు."నా ఉద్దేశం కూడా అదే!" అన్నారు శ్రీ శ్రీ
- రైల్వే స్టేషనులో కనపడిన ఒక స్నేహితుడు అతనును అడిగాడు, "ఊరికేనా?" అని. దానికి శ్రీ శ్రీ ఇలా అన్నాడు - "ఊరికే".
- ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నాడు: "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా"
- "వ్యక్తికి బహువచనం శక్తి"
- స్నేహితులతో కలిసి మద్రాసులో హోటలు కెళ్ళాడు. ఒకాయన అట్టు చెప్తానని అన్నాడు. దానికి శ్రీ శ్రీ "అట్లే కానిండు" అన్నాడు.
- ఒకసారి అతనుతొ విసిగిన రచయత ఇలా అన్నాడు "శ్రీశ్రీ నీ నిర్వచనాలు ఒట్టి విరేచనాలు " వెంటనే శ్రీశ్రీ "అవి(విరేచనాలు )నీ నోటెమ్మట రావటం నా అదృస్టం
Tags: ఖడ్గ సృష్టి, Khadga Srushti, శ్రీ శ్రీ, Sri Sri