Athma Jyothi | ఆత్మ జ్యోతి
- Author:
- Pages: 56
- Year: 2018
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Sahithi Prachuranalu-సాహితి ప్రచురణలు
-
₹30.00
అనువాదం: ముద్దా విశ్వనాథం | Mudda Viswanatham
లియో టాల్ స్టాయ్ 1828 సెప్టెంబర్ 9 న రష్యా సామ్రాజ్యంలో తుల ప్రావెన్స్ లో యస్న పోలియానా అనే గ్రామంలో గల ఎస్టేట్ లో జన్మించారు. అయన కుటుంబం రాచరిక సంబంధాలు కల్గిన జమిందారీ కుటుంబం. అయన పుట్టిన సంవత్సరానికి తల్లి ఏడూ సంవత్సరాలకు తండ్రి కూడా చనిపోయారు. పెంపకపు తల్లి దెగ్గర పెరిగాడు. యవ్వనంలో జులాయిగా తిరిగి తరువాత కజాన్ యూనివర్సిటీలో మొదట న్యాయ శాస్త్రంలోనూ తరువాత ఫిలాసఫీ లో చేరి చివరికి పూర్తీ చేయకుండానే తిరిగి తన ఎస్టేట్ కి వచ్చేసారు. అప్పటిలో రష్యా - క్రిమియా యద్దకాలంలో సైన్యంలో చేరి పని చేశారు. తిరిగి వచ్చిన తరువాత మాస్కోకు చెందిన ఓ డాక్టర్ గారి కుమార్తె సోఫియాతో పెళ్ళి అయింది. వారికీ మొత్తం పదమూడుమంది సంతానం. పదిమంది బ్రతికారు. ఈ కాలంలోనే చారిత్రాత్మకమైన యద్దము - శాంతి (1869) అన్నా కేరనిన (1877) ఇవాన్ ఇలీచ్ మృతి (1866) సజీవనం (1899) నవలలు వ్రాసారు. ఈ గ్రంధాలలో అయన వాస్తవిక వాదాన్ని ఆవిష్కరించారు. నవంబర్ 20, 1910 లో 82 సంవత్సరాల వయస్సులో చనిపోయారు.
Tags: Athma Jyothi, ఆత్మ జ్యోతి, Leo Tolstoy, లియో టాల్ స్టాయ్