Hazi Murad | హాజీ మురాద్
- Pages: 128
- Year: 2013
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹75.00
అనువాదం: ముక్తవరం పార్థసారథి
భీకర యుద్ధం! తుపాకులు పేలుతున్నాయి. సైనికులు నేలకొరుగుతున్నారు. ఇరుపక్షాలదీ ఒకటే లక్ష్యం! ఎదుటివారిని ఓడించాలి. తామే విజయభేరి మోగించాలి. ఓ పక్షంలో వేల సైనికులు! మరో పక్షంలో కేవలం ఐదుగురు! అయినా తామే గెలుస్తామన్న నమ్మకం. వారి నాయకుడు హాజీమురాద్! అదే వారి ధైర్యం. అనుచరుల తుపాకులు గురితప్పినా తమ నాయకుడు ప్రత్యర్థి సైనికుల మీద గురితప్పకుండా బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇంతలో ఓ బుల్లెట్ అతని శరీరంలోకి దూసుకుపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు హాజీమురాద్ ఎవరు?
లియో తోల్‌స్తోయ్ (సెప్టెంబర్ 9 1828 – నవంబర్ 20 1910) సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత, నవలాకారుడు. 1902 నుంచి 1906 వరకు ప్రతి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించబడ్డాడు. 1901, 1902, 1909 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి కోసం అతని పేరు ప్రతిపాదించబడింది.
1828లో రష్యాలోని ఒక కులీన కుటుంబంలో జన్మించిన టాల్ స్టాయ్ "యుద్ధమూ శాంతీ" (వార్ అండ్ పీస్) (1869), అన్నా కరెనీనా (1878) రచనలతో మంచి పేరు సాధించాడు
Tags: Hazi Murad, హాజీ మురాద్, లియో తోల్‌స్తోయ్, Leo Tolstoy