Maa Ammante Nakistam | మా అమ్మంటే నాకిష్టం
- Author:
- Pages: 150
- Year: 2021
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Chaaya Resources Center-ఛాయా రిసోర్సెస్ సెంటర్
-
₹140.00
కన్నడ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచన
అనువాదం: రంగనాథ రామచంద్రరావు | Ranganadha Ramachandra Rao
కన్నడ మూలం: వసుధేంద్ర | Vasudhendra
మరుసటి రోజు టాయిలెట్ లో కూర్చున్నప్పుడు తలుపు మీద ఎదో అస్పష్టంగా కనిపించింది. చీకట్లో ఏమిటో తెలియలేదు. బట్టలు వేసుకుని వచ్చి వెలుతురులో తలుపును చూశాను.
దుమ్ముకొట్టుకునివున్న తలుపుమీద అమ్మ చేతిముద్ర స్పష్టంగా కనపడింది. గట్టిగ ఆనిచ్చిన చేయి అలాగే కిందకి జారినట్టుంది. గుండెపోటు వచ్చినపుడు దేన్నైనా పట్టుకోవడానికి తలుపు మీద చేయి అదిమివుండాలి. అక్కయ్యను పిలిచి చూపాను.
"అవును, అది అమ్మదే. ఇన్నాళ్ళు లేదు" అంది.
ఆ చేతిగుర్తు మీద నా చేతిని పెట్టి విచిత్రమైన స్పందనని అనుభవించాను.
Tags: Maa Ammante Nakistam, మా అమ్మంటే నాకిష్టం, రంగనాథ రామచంద్రరావు, Ranganadha Ramachandra Rao