Nivedana | నివేదన
- Author:
- Pages: 140
- Year: 2014
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: Samskruti-సంస్కృతి
-
₹100.00
గీతాంజలిలోని విశ్వజనీన భావాలు, అభ్యుదయ కాంక్ష, ఎల్లరి ఉన్నతి కోరే తత్త్వం ప్రపంచాన్ని ఆకర్షించి ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య ప్రియంభావుకుల హృదయాలను కొల్లగొట్టింది.
గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తాహతునుబట్టి వారికి ఏదో కొంత అనుభూతిని అందించడం అంటారు చలం. ఆ లక్షణం నిండారి వున్న కావ్యం గీతాంజలిని సృష్టించిన రవీంద్రనాథ్ టాగోర్ ఆధునిక కాళిదాసు.
గీతాంజలి కావ్యమాలలో మేరుపూస 'కొరో జాగరిత' (Where the mind is.......) గేయం. విశ్వకల్యాణాన్ని ఆశించే వారెవరికైనా శిరోధార్యం యిందులోని భావం. ఆ గేయానికి పలువురు తెలుగు కవులు చేసిన తెలుగు అనువాదాల సుమగుచ్ఛం యీ నివేదన.
టాగోర్ జన్మించి 153 యేళ్ళు, గీతాంజలికి నోబెల్ బహుమతి వచ్చి, తెలుగులోకి అనువాదమై శతవసంతాలు పూర్తి అయిన సందర్భంగా 'సంస్కృతి' సమర్పిస్తున్న పుస్తకరూప నివాళి.
Tags: Nivedana, నివేదన, Ravindranath Tagore, రవీంద్రనాథ్ టాగోర్