Simha Senapati | సింహసేనాపతి
- Author:
- Pages: 272
- Year: 2018
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹180.00
సింహసేనాపతి
అనువాదం: గద్దె లింగయ్య
'బ్రతకడం కోసం తర్వాత యిది నా రెండో నవల. అది క్రీ.శ. ఇరవయ్యో శతాబ్దాన్ని గురించి ఇది క్రీ. పూ. అయిదో శతాబ్దానికి సంబంధించినది. నేను మానవ సమాజారంభ దశనుండి నేటివరకు జరిగిన వికాసాన్ని గూర్చి ఇరవై కథలు (ఓల్గా నుంచి గంగవరకు)గా వ్రాయాలనుకొన్నాను. వాటిలో ఒకటి బౌద్ధ యుగానికి సంబంధించినది. వ్రాయటానికి పూనుకున్నప్పుడు అన్ని విషయాలను కథలో యిముడ్చుట కానిపనిగా తోచింది. అందువల్లనే ' సింహ సేనాపతి' నవలా రూపంలో మీ ముందుకు వస్తోంది. - రాహుల్జీ
తొమ్మిదేళ్లప్పుడే ప్రపంచం ఏమిటో చూడాలని ఇంట్లోంచి పారిపోయాడు సాంకృత్యాయన్. 8వ తరగతి తోనే అతని చదువు ఆగిపోయింది. వేలాది కిలోమీటర్లు కాలినడకన చుట్టివచ్చారు. మూడు బౌద్ధ వేదాలనూ జీర్ణించుకుని త్రిపిటకాచార్య అయ్యారు. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్ రష్యా... ఎక్కడ తిరిగితే అక్కడి భాష నేర్చుకున్నారు. అరబిక్, భోజ్పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళీస్, తమిళం, ఉర్దూ లాంటి ముప్పైకి పైగా భాషలు, అందులోని యాసలు కూడా ఆయనకు తెలుసు. ఎక్కడా అధికారికంగా చదువుకోకపోయినా విశ్వవిద్యాలయాల్లో బోధించే స్థాయికి ఎదిగారు.అందుకే ఆయన్ని మహాపండిత్ అనేవారు.
Tags: Simha Senapati, సింహసేనాపతి, Rahul Sankrityayan రాహుల్ సాంకృత్యాయన్