Ka Raju Kathalu | క రాజు కథలు

Ka Raju Kathalu | క రాజు కథలు

  • Author: సింగీతం శ్రీనివాసరావు | Singeetam Srinivasarao
  • Pages: 97
  • Year: 2005
  • Book Code: Paperback
  • Availability: 2-3 Days
  • ₹100.00

అనగనగా ఓ రాజ్యం. దాన్ని పాలిస్తున్న ఓ రాజుగారు. నిజానికి ఈ రాజుగారి పేరు అనవసరం. మా అమ్మమ్మ అనగనగా ఓ రాజని కథ మొదలు పెట్టేదే తప్ప ఏ రోజూ రాజు పేరు చెప్పలేదు. కాని ఆ రోజులు వేరు. కధ బాగుంటే చాలు. రాజు పేరును గురించి ఎవరూ పట్టించుకునే వారు కాదు. రోజులు మారాయ్‌. ఇపుడు కథ ఎలా వున్నా సరే, అది యే రాజుని గురించి, అతని పేరేమిటని అడుగుతారు. పెద్ద పేరైతే ఎగబడి వింటారు. పేరు లేకపోతే దాని దరిదాపులోకి కూడా రారు. అందుకని పేరంటూ ఏదో ఒకటి ఉండాలి కనుక మన రాజును 'క' అని పేరు పెట్టుకుందాం. ఈ రాజు కథలు ఎన్నో, ఎన్నెన్నో.

క రాజుగారికి ఒక మంత్రి. అతని పేరంటారా? అఖ్ఖర్లేదు. పేరుండవలసింది ముఖ్యులకే. క రాజు గారు మొదట్నుంచీ కళాప్రియులు. పొద్దున్న లేచినప్పటినుంచి సాయంత్రం వరకూ వివిధ కళలను, కళాకారులను ప్రోత్సహించడమే అతని నిత్య కర్తవ్యం. తిండి, గుడ్డ, కొంప లాంటి సాధారణ విషయాలను మంత్రికప్పచెప్పేవాడు. ఈ పనుల్ని మంత్రి తన ఉప మంత్రులకు పురమాయిస్తే వాళ్ళు తమ క్రిందున్న పదహారు ఉపోపమంత్రులకు అంటగట్టేవారు. ఇలా అలా ఆజ్ఞలు చివరివరకు ప్రాకి రాజ్యంలోని ప్రజలంతా 'ఆహా, మన రాజ్యంలో అందరూ ఆజ్ఞాపించేవారే' అని సగర్వంగా చెప్పుకునవారు'' - అంటూ మొదలుపెట్టి మొత్తం 21 కథల్నీ చదివినవారికి నవ్వొచ్చేలా చెప్పినది - తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, ఇంగ్లీషు భాషలలో సుమారు 60 చిత్రాలకు దర్శకత్వం వహించి, జాతీయస్ధాయిలో రాష్ట్రపతి పతకాలు, రాష్ట్రస్ధాయిలో నంది అవార్డులు వంటి ఉన్నతమైన ప్రతిష్టాత్మక బహుమతులు పొందిన శ్రీ సింగీతం శ్రీనివాసరావుగారు.  

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: సింగీతం శ్రీనివాసరావు, Singeetam Srinivasarao, క రాజు కథలు, Ka Raju Kathalu

TOP