Nindu Punnami Pandu Vennela | నిండు పున్నమి పండు వెన్నెల
- Author:
- Pages: 152
- Year: 2015
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Mitramandali Prachuranalu-మిత్రమండలి ప్రచురణలు
-
₹100.00
ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగు వారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమో గానీ, ఆమె గాత్ర మాధుర్యం విషయంలో మాత్రం ఎవరికీ ఏలాంటి అభిప్రాయభేదముండదు. ఆమే రావు బాలసరస్వతీ దేవి. నేటి యువతరానికి తెలీకపోవచ్చు గానీ మధ్యవయస్సు వారికీ, ఆపై వయస్సు వారికీ ఆమెను పరిచయం చేయనక్కరలేదు. ‘నల్లనివాడ నే గొల్లకన్నెనోయీ...’ అంటూ ఆమె పాడితే విని మైమరచిన వారే వారంతా. అలా పాటే శ్వాసగా పెరిగిన అలనాటి మధుర గాయని ఆర్. బాలసరస్వతీ దేవి.
వివిధ భాషలలో ‘బాల’ పాడిన పాటలు రెండువేలు ఉండొచ్చును అంటున్నారు. తెలుగు చలనచిత్రాలకు ‘బాల’ పాడిన పాటలు వున్న స్వల్ప వ్యవధిలో సేకరించగలిగినన్ని సేకరించి కాలక్రమంలో పొందుపరిచాము.
‘బాల’కి సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేకతను ధన్యతను కల్పించినవి ఆమె పాడిన లలిత గీతాలే కనుక, వాటిని కూడా అచ్చువేయవలసిందే. 42 లలిత గీతాలను సేకరించి మీకు అందించగలుగుతున్నాము.
- రవికృష్ణ
Tags: Nindu Punnami Pandu Vennela, నిండు పున్నమి పండు వెన్నెల, రవికృష్ణ, Ravikrishna