Gupta '91|గుప్తా '91

Gupta '91|గుప్తా '91

  • ₹175.00

ఎంత మనసు పీకినా జేబు దగ్గరే గుండెకాయ ఉండటం వల్ల గుప్తాకి ధైర్యం చాల్లేదు. "ఒద్దులేగానీ, ఓ కార్డుంటే చూడు. సర్దాకయ్యా బాబు. వస్తూంటాను కదేటి? మీ సేటుగారు మా బ్యాంకులోనే గదా?" మొత్తానికి ఎక్కణ్ణుంచో వాడు కొంచెం మాసిన రెండు కార్డులు సంపాదించి ఇచ్చేడు. కానీ వారంపాటు గుప్తా కళ్లనిండా ఒకళ్ల చుట్టూ ఒకళ్లు చిక్కుముళ్లు పడ్డ అమెరికన్ ఎర్ర స్త్రీ పురుషులు ఉండిపోయారు.

-----

సన్నగా తెల్లగా ఒకామె తన పక్కనే కూచుని నైటీలు చూసుకుంటోంది. ఏదో పరిమళం అతని మీదికి పాకుతోంది. గులాబీ రంగు నైటీ దూరంగా పట్టుకుని చూస్తోందామె. లోపలి లాగుల దొంతర్లలో అతనామెను నైటీ లేకుండా చూసాడు. బనీన్ల బీరువా దగ్గర నుంచుని అద్దంలో ఆమెని ఎక్కువసేపు చూడలేక ఒణుకుతున్న చేతుల్తో, లోపలి లాగుల సంచీ తీసుకుని బయటపడ్డాడతను. మంటలు, ఆమే అతన్ని చిందర వందర చేశాయి. 

-----

"స్వామీ, అతని గురించి నీకు పూర్తిగా తెలీదు. ఒక మాట చెప్పు- ఒక అబద్ధాన్ని నమ్మి జీవితాన్ని సమూలంగా మార్చుకోవడం కుదురుతుందా?"

"ఒకటి, కుదురుతుంది. అబద్ధం విని చెడ్డం ఎలాగో బాగుపడ్డం అంతే.  రెండు,  అబద్ధం అని అతనికి తెలియదు. మూడు, అతను నమ్మిన అబద్ధం అతనికి వాస్తవం. నాలుగు, అసలు సత్యం అంటే ఏంది? సత్యాసత్యాలు వైయక్తికం. అయిదు, ఆ రెండూ శాశ్వతం అని చెప్పలేం. ఆరు, చివరికి జీవితం సత్యం మీదే ఆధారపడిందని నేను అనుకోడం లేదు.

ఇంతకీ మీ నాయుడు ఏ అబద్ధం నమ్మి బాగుపడ్డాడు? అబద్ధం వేరు, అవాస్తవం వేరు." 

-----

కిటికీలోంచి గాలి అతన్ని విసిరి వెనక కిటికీలోంచి బయట పారేస్తుంది. తప్పదు.

చేతుల్లేని ఎరుపు బనీను. నూనెతో మెరుస్తోన్న దట్టమైన జుట్టుకి నొక్కి వెనక్కి దువ్వేడు.

అతను గాలిపొరల్లోంచి, కంట్లో నీటిపొరల్లోంచి నన్ను పరిశీలనగా చూస్తున్నాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Gupta 91, గుప్తా 91, Tallavajjhala Patanjali Sastry, తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి, 9789393056047, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ