Kollayi Gattite Nemi? | కొల్లాయి గట్టితే నేమి?
- Author:
- Pages: 364
- Year: 1965
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹250.00
కొల్లాయి గట్టితే నేమి? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల
ఒకమాట
1921 -
మార్చి 31, ఏప్రిల్ 1.
ఆనాడు బెజవాడలో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. కాంగ్రెస్ జీవితంలో ఆ సమావేశానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యం వుంది.
- కాంగ్రెస్‌ను విస్తృత ప్రాతిపదికగల ప్రజాసంస్థగా రూపొందించేటందుకు ఆ సమావేశంలోనే నిర్ణయించారు. - ఖద్దరు వుద్యమం, మద్యనిషేధం కాంగ్రెసు కార్యక్రమంలో భాగాలుగా స్వీకరించబడ్డాయి. - ప్రజల నుంచే ప్రజోద్యమాల నిర్వహణకు ధనం సేకరించే నిర్ణయం తీసుకొన్నారు.
ఆనాటి నుంచీ ముప్పేటన జాతీయోద్యమం తెలుగుదేశం నాలుగు చెరగులా అలుముకుంది.
వివిధ తరగతుల ప్రజలు తమ ఆదరాలు, అభిమానాలు, ఆశలు, రోషాలు—ప్రక్కకు పెట్టారు.
ఓపినంతలో
తోచిన పద్ధతిలో
ప్రతి ఒక్కరూ ఆ మహాయజ్ఞానికి సమిధనొక్కటి సమర్పించారు.
అసంఖ్యాక ప్రజానీకాన్ని కదిలించి, ముందుకు తీసుకుపోగలిగిన ఒక మహావ్యక్తిని తెలుగు దేశం ముక్తకంఠంతో కీర్తించింది.
ఆయన రూపొందించిన ఖద్దరు వుద్యమాన్ని చేతులు చాచి అందుకొంది, పాటలు పాడింది.
సుందరమైన రాట్నమే పసందు బాంబురా||………
ఆనాటి తెలుగుదేశపు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చిత్రిస్తున్న ఈ నవలకు 'కొల్లాయి గట్టితేనేమి?' అని పేరు పెట్టడం కొంతవరకు ఆక్షేపణీయంగా వుంటుందని నేనెరుగుదును. ఏమంటే గాంధీజీ ఈ కథ ముగిసిన మరి ఆరు నెలలకుగాని 'కొల్లాయి' కట్టడం ప్రారంభించలేదు.
కొల్లాయి గట్టకపోయినా ఆయన నిరాడంబర జీవితం, సాధువర్తనం, సమాజంలో అడుగున వున్న జనానికి దగ్గరగా వుండాలనీ, వారిని పైకి తెచ్చేటందుకు ఆయన పడే తపన—ఇవే ఆనాడు ఆయనను తెలుగుదేశానికి ప్రియతముడిని చేశాయి. దానిని తెలుపడానికి మాత్రమే ఆ పేరు.
ఇంకొక్కమాట చెప్పాలి. ఈ నవలకు కేంద్రంగా ముంగండనూ, పరిసరాలనూ తీసుకోవడం కల్పనలో కొంత భారం తప్పించుకొనేటందుకు తప్ప దీనిలో పాత్రలేవీ యదార్థాలు కావు. కథ జరిగి వుండనూ లేదు.
ఇంక ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను, వస్తున్న మార్పులను చిత్రించడంలో ఎంతవరకు కృతకృత్యుడనయ్యానో తెలుగుదేశం చెప్పాలి.
వేచి వుంటా……
- రచయిత
Tags: Kollayi Gattite Nemi, కొల్లాయి గట్టితే నేమి, మహీధర రామమోహనరావు, Mahidhara Rama Mohana Rao