Chivaraku Migiledi | చివరకు మిగిలేది

Chivaraku Migiledi | చివరకు మిగిలేది

  • ₹250.00

చివరకు మిగిలేది బుచ్చిబాబు రచించిన మనోవైజ్ఞానిక నవల. జీవితానికి సంబంధించిన పలు మౌలికమైన ప్రశ్నలను రేకెత్తించే రచనగా పలువురు సాహిత్యవేత్తలు పేర్కొన్నారు.

ఎన్నో కథలను రచించిన బుచ్చిబాబు రాసిన ఏకైక నవల చివరికి మిగిలేది.

తెలుగు నవలాచరిత్రలో ప్రముఖ సాహితీవేత్తలు శాశ్వతస్థానంగలదిగా గుర్తించిన నవల బుచ్చిబాబు గారి చివరకు మిగిలేది. దీన్లో కథ స్వతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో సాగుతుంది. ముఖ్యంగా నవల కథానాయకుడైన ధయానిది జీవితానికి సంబంధించిన అనేక మార్పులు, అతనికి తారసపడిన అనేకానేకుల మనస్తత్వాలను విశ్లేషించుకొంటూ రచయిత ధయానిది పాత్రను నడిపిస్తుంటాడు.

చివరకు మిగిలేది సమగ్రమైన తొలి మనోవైజ్ఞానికనవలగా విశేషమైన మన్ననలు పొందినది. ముందు రచయిత ఉపోద్ఘాతంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు కొన్ని ఇక్కడ చెప్పవలసివుంది.

  1. ప్రతీరచయితకీ తన ఆంతరంగికాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే రచయితకి సంతృప్తి కలుగుతుంది. ... దానికొక మూల్యం, సామాజిక ప్రయోజనం ఏర్పడుతుంది.
  2. పాఠకులకు జీవితంపై ఒక దృక్పథాన్ని కలగజేయాలనే ఉద్దేశంతోనే ఈరచన సాగింది.
  3. తల్లి చేసిన అపచారం నీడలా అతన్ని వెంటాడి, సంఘవిమర్శద్వారా, జీవితాన్ని కలుషితం చేసింది. ఈదౌర్జన్నాన్ని ఎదుర్కొడంలో అతను కొన్ని విలువల్ని సాధిస్తాడు. ఆవిలువలతో ఈనవలకి నిమిత్తం వుంది అంటారు రచయిత తన తొలిపలుకులో.
  4. రచయితకి జీవితంపై వున్న జిజ్ఞాసనీ, సమగ్రంగా నిజాయితీతో అనుభవించగలిగేటట్లుగా చిత్రితమైనవా లేదా అన్నదే పాఠకునికి కావలసింది.
  5. బెర్ట్‌రండ్ రాసిన “A Freeman’s Worship” అన్న వ్యాసం తననీ, జీవితంపై తనకు గల దృక్పథాన్ని మార్చివేసింది. అయితే తాను ఈనవల రాస్తున్నప్పుడు రసెల్ కానీ ఆవ్యాసం గానీ తన దృష్టిలో లేదని పాఠకులు గమనించాలన్నారు.

కథంతా దయానిధి అనబడే ఒక తాత్త్వికునికోణంలోనే నడుస్తుంది. ఇది అతని భావనాలోకపు రికార్డు. తనజీవితంలో తారసపడిన ప్రతివ్యక్తినీ మానసికవిశ్లేషణ చేసుకుంటూ పోతాడు ఆద్యంతం. అతనిజీవితంలో ప్రాముఖ్యత వహించిన వ్యక్తులు - అతనితల్లీ, కోమలీ, అమృతం, సుశీలా, తరువాత కొంతవరకూ ఇందిరా, నాగమణీ, కాత్యాయినీ. ... దయానిధి వెలిబుచ్చే అభిప్రాయాలు చూస్తే పాఠకులసానుభూతికోసం ఆరాటపడుతున్నవాడిలా కనిపిస్తాడు. అతని మనోవిశ్లేషణంతా తనలోపాలన్నిటికీ కారణం ఎవరా అని వెతకడంతోనూ, ఆలోపాలని ఎవరినెత్తిన రుద్దుదామా అన్న తాపత్రయంతోనూ సరిపోతుంది.


Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: చివరకు మిగిలేది, బుచ్చిబాబు, మనోవైజ్ఞానికనవల, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్