Naveena Viswaroopa Silpi - Stephen Hawking | నవీన విశ్వరూపశిల్పి - స్టీఫెన్ హాకింగ్

Naveena Viswaroopa Silpi - Stephen Hawking | నవీన విశ్వరూపశిల్పి - స్టీఫెన్ హాకింగ్

  • ₹35.00

డా|| రాజూరు రామకృష్ణా రెడ్డి | Dr. Rajuru Ramakrishna Reddy

స్టీఫెన్ విలియం హాకింగ్ (ఆంగ్లం: Stephen Hawking) 1942-2018 సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వల్ల క్రమక్రమంగా దశాబ్దాల తరబడి అతని శరీరభాగాలు చచ్చుబడుతూ వచ్చినా, తన మెదడు పనిచేస్తూండడాన్ని దన్నుగా ఉపయోగించుకుని కృష్ణబిలాలకు సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్‌లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో జీవిత కాల సభ్యునిగా ఉన్నాడు. ఆయన అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్నాడు. టైమ్స్ పత్రిక వారి 100 మంది అత్యంత గొప్పవారైన బ్రిటీషర్ల జాబితాలో 25వ స్థానం అతనిదే. ఆయన రాసిన ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం ద బ్రిటీష్ సండే టైమ్స్ బెస్ట్ సెల్లర్ల జాబితాలో 237 వారాల పాటు నిలిచి రికార్డులు బద్దలుకొట్టింది, ఈ పుస్తకపు అమ్మకాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాయి. శరీరం చాలావరకూ చచ్చుబడిపోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదులుస్తూ, దానికి అమర్చిన సంభాషణలు-ఉత్పత్తి చేసే పరికరం ఉపయోగించి సంభాషించేవాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ ఆయన చేసిన పరిశోధనా కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది.

కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే...

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Naveena Viswaroopa Silpi, Stephen Hawking, నవీన విశ్వరూపశిల్పి, స్టీఫెన్ హాకింగ్, డా. రాజూరు రామకృష్ణా రెడ్డి, Rajuru Ramakrishna Reddy