Nobel Kavitvam | నోబెల్ కవిత్వం
- Author:
- Pages: 300
- Year: 2013
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Nishita Publications- నిషిత పబ్లికేషన్స్
-
₹170.00
తెలుగు సాహిత్య వాతావరణానికి ముకుంద రామారావు గారు ఒక గొప్ప ఉపకారం చేశారు. నోబెల్ బహుమానపు మహద్ద్వారం తెరిచి, ఆ బహుమానం పొందిన కవిత్వంలో ఏం జరిగిందో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చూపించారు. 1901 నుంచీ 2011 వరకూ నోబెల్ బహుమానం అందుకున్న కవుల జీవితకథలు సంగ్రహంగా చెప్పి, వాళ్ళ కవిత్వంలో మచ్చుతునకలు కొన్ని అనువాదం చేసి అందించారు.
* * *
నోబెల్ బహుమానాలు ఇవ్వడంలో వున్న రాజకీయాలనీ, ఏమరుపాట్లనీ ఒదిలిపెట్టకుండా, సున్నితంగా చూపించారు. మూడువందల పేజీల్లో మనకి ఒక కవితా ప్రపంచాన్ని చూపించారు.
* * *
కవిత్వంలో ఇన్ని రకాల గొంతుకలు ఒక వ్యక్తి మనకు వినిపించడం తెలుగు సాహిత్యంలో ఇంతకుముందు జరగలేదు. అనువాదకుడు బహురూపి. మాంత్రికుడు. రకరకాల వ్యక్తుల మనసుల్లోకి పరకాయప్రవేశం చేయగల శక్తి గల వ్యక్తి. ఎవరి పద్యం అనువాదం చేస్తూంటే వాళ్ళ గొంతుకే తన కంఠంలోంచి వినిపించగల నటుడు. ముకుంద రామారావుగారు ఈ ప్రయత్నంలో సాధించిన విశేషం ఆధునిక తెలుగు సాహిత్యానికి ఒక అపూర్వమైన బహుమానం.
------ వెల్చేరు నారాయణరావు
Tags: Nobel Kavitvam, నోబెల్ కవిత్వం, ముకుంద రామారావు, Mukunda Rama Rao