Telugu Kavula Aparadhalu |తెలుగు కవుల అపరాధాలు
- Author:
- Pages: 116
- Year: 2011
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Vahini Book Trust-వాహిని బుక్ ట్రస్ట్
-
₹80.00
కొందరు ఒక జీవితకాలంలో చిన్న గుంతను తీసి నీరు నింపుతారు. కొందరు బావి తవ్వి బాటసారులకు వదిలిపెడతారు. కొందరు చెరువుకు ఆనకట్ట కట్టగలుగుతారు. కొందరు తటాకాలను కళకళలాడిస్తారు. కొందరైతే సరస్సులనే మన మానస మందిరాల్లో నింపుతారు. కాని సముద్రాలను సృష్టించినవారు కొందరుంటారు. అంచనాకు అందరు. సముద్రానికి సరిపడా మాలను అల్లగలరా ఎవరైనా? శ్రీకాంత శర్మ బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత్వం రాశారు. కథ రాశారు. నవల రాశారు. నాటిక రాశారు. నాటకం రాశారు. పాట రాశారు. గేయం రాశారు. యక్షగానం రాశారు. విమర్శ రాశారు. పరిశోధన రాశారు. అనువాదం రాశారు. కాలమ్స్ రాశారు... ఒక్క అక్షరం వృథా చేయకుండా పనికొచ్చేదంతా పులకరింప చేసేదంతా రాశారు. ఒకరోజు రెండు రోజులు కాదు... 1960 నుంచి ఇప్పటి వరకూ దాదాపు యాభై ఏళ్లు రాశారు. ఒక పేజీ రెండు పేజీలు కాదు వేలాది పేజీలు రాశారు. రోజూ తోడిబోస్తే ఒకనాటికి అది సముద్రం అవుతుందంటారు.
Tags: Indraganti Srikanth Sarma, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, Telugu Kavula Aparadhalu, తెలుగు కవుల అపరాధాలు