Devadasu Cinema Navala | దేవదాసు - సినిమా నవల

Devadasu Cinema Navala | దేవదాసు - సినిమా నవల

  • ₹120.00

    ₹150.00

సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ వ్రాసిన దేవదాసు నవల భారతీయ సినిమా నిర్మాతలకు ఎంతో ఇష్టమైన చిత్ర కథ అయ్యింది.

1950 దశకంలో తెలుగు సినిమా మంచి ఉచ్ఛదశలో ఉంది. అప్పుడు విడుదలైన దేవదాసు ఎన్నో విధాలుగా చరిత్ర సృష్టించింది. శరత్ బాబు నవలను తెలుగులోకి అనువదించి చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించాడు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వానికి, అక్కినేని, సావిత్రిల నటనకు, ఘంటసాల గానానికి ఈ సినిమా చరిత్రలో మచ్చుతునకగా నిలిచి పోయింది. భగ్న ప్రేమికులకు "దేవదాసు" అనే పదంతెలుగు సాహిత్యంలో భాగమైపోయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు సుబ్బరామన్కు అంకితమిచ్చారు.

“పాత్రలు, వాటి మనస్తత్వాలు విశ్లేషణ బాగా తెలియాలంటే శరత్ సాహిత్యం చదవమని సముద్రాలగారు సలహా యిచ్చి ఆ పుస్తకాలు తెప్పించి ఇచ్చారు. అప్పుడే ’దేవదాసు’ చదివాను. ‘దేవదాసు’ పాత్రని నా వూహమేరకు విశ్లేషించుకున్నాను కూడా. ఇది ఎవరైనా సినిమా తీస్తే?... ఏదో ఆలోచన... ’స్త్రీ సాహసము’, ’శాంతి’ చిత్రాల తర్వాత డి.ఎల్.నారాయణగారు ’దేవదాసు’ తీస్తానన్నాను. అజరామరమైన ఆ పాత్ర నాకిస్తానన్నారు. సావిత్రి పార్వతి. నేను ఎగిరి గంతేసినంతటి వార్త! కాని పరిశ్రమలో పెద్ద దుమారం లేచి, గాలివాన వీచినట్టయింది. ”నాగేశ్వరరావు దేవదాసా? సావిత్రి పార్వతా? వేదాంతం రాఘవయ్య దర్శకుడా? దీంతో వినోదాసంస్థ, డి.ఎల్. అందరూ కొట్టుకుపోవడం ఖాయం!” అన్నారు. ’ఏమైనా సరే, ’దేవదాసు” తీద్దాం. కష్టపడదాం. కృషి చేద్దాం” అన్నాడు డి.ఎల్. చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్దలు కూడా ”ఆ బరువు నువ్వు మొయ్యలేవు – నువ్వు ఇంకా రాటు తేలాలి” అన్నారు. ఒక్క బి.ఎన్.రెడ్డిగారు మాత్రం “చాలా మానసిక క్షోభ అనుభవించే పాత్ర. సంఘర్షణగల పాత్ర. బాగా స్టడీ చేసి చెయ్యి” అని ప్రోత్సహించారు. ఆ విమర్శల్నీ, నిరుత్సాహాన్నీ ఎదుర్కొని, ఏటికి ఎదురీదాలని పట్టుబట్టాను... శరత్ పాత్రల్ని బాగా స్టడీ చేసిన చక్రపాణిగారితో కూచుని చర్చించాను. ప్రేక్షకుల సానుభూతి పొందే పాత్రగా ఎలా రూపొందించాలి? నేను మధన పడ్డాను. మొండిధైర్యంతో, పట్టుదలతో కృషి చేశాను. అందరిదీ అదే పట్టుదల! ఈ ’ఛాలెంజ్’ ని ఎదుర్కోవాలని. దేవదాసు బలహీనుడు కాదు సాహసి కాడు మానసిక వ్యధ అనుభవించే నాయకుడు... ప్రతి టెక్నీషియను, ప్రతి నటుడూ అందరూ శ్రమించారు. 1953 జూన్ 26న ’దేవదాసు’ విడుదలై పెద్ద సంచలనం తెచ్చింది. పండితులు, పామరులూ అందరూ – అందరూ మెచ్చుకున్నారు. పరిశ్రమనే మలుపుతిప్పిన ఆ సినిమా, నా నట జీవితాన్ని ఒక మలుపు తిప్పింది! ’దేవదాసు’ విడుదలైన 58 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు నవలా రూపంలో పుస్తకం రావడం అభినందనీయం”

- అక్కినేని నాగేశ్వరరావు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Devadasu Cinema Navala, దేవదాసు సినిమా నవల, టి. ఎస్. జగన్మోహన్, T.S.Jaganmohan