Ontari | ఒంటరి
- Author:
- Pages: 260
- Year: 2017
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: TANA PUBLICATIONS - తానా ప్రచురణలు
-
₹275.00
నన్ను పట్టి పీడించే ఒక జీవితకాలపు వేదన ఈ నవల.
డోజర్లతో పొదలన్నిట్నీ కుళ్లగించి, బరకల్నీ, బీడునేలల్నీ సాగుభూములుగా మార్చే క్రమంలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తోన్న దుర్మార్గం ఒకవైపు పల్లెల్ని కమ్ముకొస్తూవుంటే, మరోవైపు పాతకాలపు వృక్షాల ఫలసాయంతో తృప్తిపడాల్సిందిపోయి, ఆ చెట్లనే నరికి సొమ్ము చేసుకోవాలని చూసే మూర్ఖత్వం, స్వార్ధం చుట్టుముడుతూవుంటే, ఇంకోవైపు బహుళజాతి కంపెనీల వంగడాలతో సాంప్రదాయక విత్తనాలు, తృణధాన్యాలను మట్టిలో పాతిపెట్టే అత్యాశ ఒక దయ్యంలా వెంటాడుతోంటే పల్లె తన స్వరూపం కోల్పోతున్న పరిస్థితి నా హయాంలోనే చూస్తూ వున్నాను.
ఈ విధ్వంసదృశ్యాలన్నిటికీ సాక్షీభూతంగా నిల్చున్న దయనీయ స్థితిలోంచి ఈ నవల పుట్టింది. పర్యావరణాన్ని మాత్రమే కాదు, తన్ను తాను కాల్చి బూడిద చేసుకునే దిశగా మనిషి గమనం చూస్తున్నాను కాబట్టే ఈ నవల రాయాల్సివచ్చింది. రోడ్డుకు దూరంగా, మారుమూల పల్లెల్లో బతుకుతూ వున్న పాత కాలపు వ్యవసాయదారుల జీవన మూలాల్ని అంటుగట్టి తెచ్చి, నగరీకరణ దిశగా అడుగులేస్తోన్న పల్లెవీధి కూడళ్లలో నాటగలిగితే ఈ రోగానికి కొంతైనా ఉపశమనపు మందు తయారవుతుందేమోనన్న ఆశతో ఈ నవల రాశాను.
ప్రకృతిని అర్థం చేసుకున్నవాడెవడూ దాన్ని విధ్వంసం చేయడు.
జంతువుల అరుపుల్ని వాటి భాషగా అర్ధం చేసుకోలేక, మొక్కల స్పర్శని వాటి పలుకులుగా అనువదించుకోలేక, పక్షుల కిలకిలారావాల్ని వాటి మాటలుగా గ్రహించలేక, వాటితో చెలిమి చేయలేక, వాటిని దూరంగా తరిమి నేలను సొంతం చేసుకోవాలని ప్రయత్నించే మనిషికి మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కొంతైనా అధ్యయనం చేయించే ఒక చిన్న ప్రయత్నమే ఈ ‘ఒంటరి’ నవల. - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
Tags: Ontari, ఒంటరి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, Sannapu Reddy Venkatarami Reddy