Manobhiraamam | మనోభిరామం
- Author:
- Pages: 208
- Year: 2005
- Book Code: Paperback
- Availability: 2-3 Days
- Publisher: EMESCO-ఎమెస్కో
-
₹60.00
శౌరి యశస్విల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది! కాని శ్రీశైల ప్రయాణంలో ఎదురైన ప్రమాదం వారిద్దరి మధ్య ఉన్న అపోహలను తొలగించింది.
తీరా తిరిగి హైదరాబాదు చేరుకోగానే శౌరి పినతండ్రి మూలంగా వారిద్దరి మధ్యా మనఃస్పర్థలు కలుగుతాయి. ఓ ఇరవై లక్షలు, పన్నాలాల్ దగ్గర అప్పు తీసుకుని అది తీర్చకుండానే శౌరి తండ్రి మరణిస్తాడు.
ఆ డబ్బు యశస్వి కోసమేనని పినతండ్రి చెబుతాడు. ఆ డబ్బు ఎక్కడ కట్టాలో అని యశస్వి శౌరిని కలుసుకోవటం లేదని ఎక్కిస్తాడు. అసలు వీరిద్దరి మధ్యా ఉన్న ఆ అపోహలేమిటి? అవి ఎట్లా తొలగిపోతాయి? శౌరి పినతండ్రి మూలంగా వచ్చిన మనఃస్పర్థలు ఏమౌతాయి?
శౌరి జీవిత పోరాటాన్ని యశస్వి ఎట్లా తన పోరాటంగా స్వీకరించాడు?
ఇవన్నీ తెలుసుకోవాలంటే అశేష ఆంద్ర పాఠకుల అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి సుమధుర నవల "మనోభిరామం" చదవండి!
Tags: Manobhiraamam, మనోభిరామం, యద్దనపూడి సులోచనారాణి, Yaddanapudi Sulochana Rani,