Badadeedi*Nishkruthi*Savita*Datta | బడదీది*నిష్కృతి* సవిత*దత్త
- Author:
- Pages: 410
- Year: 1917-19/2005
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹200.00
శరత్ సాహిత్యం-6| బాడదీసి*నిష్కృతి* సవిత*దత్త Sarath Saahithyam-6 | Badadeedi*Nishkruthi*Savita*Datta
అనువాదం: బి. శివరామకృష్ణ
శరత్ చంద్ర చటోపాధ్యాయ్ (బెంగాలీ) ఇరవయ్యవ శతాబ్ధపు ప్రముఖ బెంగాలీ నవలా రచయిత, కథా రచయిత. శరత్ చంద్రుడు బెంగాలీ రచయిత. ఆయన నవలలు తెలుగునాట ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిర స్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. చివరకు కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు.
19వ శతాబ్దం మధ్య నుండి 20వ శతాబ్దం మధ్య వరకు శరత్ వర్ణించిన స్త్రీ జీవించిన సాంసారిక, సామాజిక పరిస్థితులే కొంచెం అటూ ఇటూగా తెలుగునాట కూడా ఉన్నాయి. స్త్రీలోని బహుముఖీన స్వభావాలు తెలుగు పాఠకులనూ, ప్రధానంగా స్త్రీలనూ ఆకర్షించాయి. అందుకే తెలుగు పాఠకులకు శరత్ అత్యంత ఆదరణీయ రచయిత కాగలిగాడు. శరత్ రచనలను పలువురు రచయితలు తెలుగులోకి అనువదించారు. వీరిలో బొందలపాటి శివరామకృష్ణ, శకుంతలాదేవి గార్ల అనువాదం సరళంగానూ, సూటిగానూ, మూల విధేయంగానూ ఉంటుంది. అందుకే పాఠకులాదరించారు. తమవాడుగా శరత్ను భావించారు. కనుకనే చదవడం నేర్చిన ప్రతి తెలుగువాడి హృదయంలోనూ అభిమాన రచయితగా భద్రపీఠం పొందాడు శరత్.
Tags: Badadeedi, Nishkruthi, Savita, Datta, బడదీది, నిష్కృతి, సవిత, దత్త, శరత్ చంద్ర చటోపాధ్యాయ్, Sarat Chandra Chattopadhyay