Modugu Poolu | మోదుగుపూలు
- Author:
- Pages: 159
- Year: 2015
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Navachetana Publishing House-నవచేతన పబ్లిషింగ్ హౌస్
-
₹100.00
మోదుగుపూలు నవల 1944-51 మధ్య తెలంగాణలో నెలకొన్న ప్రజా పోరాటాన్ని చిత్రించిన నవల. ఈ నేపథ్యంలో జాగీర్దారీ ప్రాంతంలో ఎలాంటి అకృత్యాలు, అరాచకాలు చెలరేగాయో క్రమంగా చైతన్యవంతులైన ప్రజలు అధికార వర్గాలను , వారి పీఠాలనూ ఎలా కదిలించాయో మోదుగుపూలు నవలలో ఉంటుంది. సాంకేతికంగా నవలలో ఉన్నది కోయగూడెమే అయినా తెలంగాణ అంతటి అవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నవలలో కథానాయకుడైన రఘ పాత్రలో ఉన్నది ప్రచ్ఛన్నంగా రంగాచార్య గారే. అందుకే ఇది చారిత్రాత్మక ఆత్మకథాత్మక నవలగా చెప్పవచ్చు. ప్రాధమికంగా నవలలో రఘ, జానకి, వీరయ్య , సింగన్న , భీముడు, రావడు, నాగేష్, రుక్మిణివి చైతన్యవంతమైన పాత్రలుగా కనిపిస్తే తాసిల్దారు, గిర్దావరు, షావుకారు వెంకయ్య, అమీను అహంకారం మూర్తీభవించిన అధికార పీఠాలుగా కనిపిస్తారు.
Tags: మోదుగుపూలు, Modugu Poolu, Dasaradhi Rangacharya, దాశరథి రంగాచార్య