Rajasekhara Charitramu | రాజశేఖర చరిత్రము
- Author:
- Pages: 224
- Year: 1987
- Book Code: Paperback
- Availability: Out Of Stock
- Publisher: Visalandhra Publishing House-విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
-
₹100.00
తెలుగు భాషలో మొట్ట మొదటి బహుళ ఆదరణ పొందిన వచన నవల. దీనిని రచించినది కందుకూరి వీరేశలింగం. ఈయన ఈ నవలను అలీవర్ గోల్డ్‌స్మిత్ ఆంగ్లంలో వ్రాసిన ది వికార్ అఫ్ వేక్ ఫీల్డ్ నుండి ప్రేరణపొంది రచించినా గోల్డ్‌స్మిత్ రచనతో పెద్దగా సంబంధములేదని అన్ని విషయాలు కొత్తవేనని పుస్తకంగా రెండవ ముద్రణ వెలువడినపుడు వీరేశలింగం తెలియచేశాడు. ఈ పుస్తకం ఆంగ్లం,తమిళం, కన్నడ మొదలగు భాషలకు అనువాదం చేయబడి ప్రజాదరణ పొందినది. ఎన్నోసార్లు యూనివర్శిటీ పాఠ్యపుస్తకంగా కూడా ఎంపిక చేయబడింది.
తెలుగు నవలలో ఇదే మొదటిది కాకున్నా ఈ పుస్తకం ప్రభావం రీత్యా తెలుగు మొదటి నవలగా పేరుగాంచినదని, తరువాత వ్రాసిన నవల లన్నిటికీ, నవలా రచయిత లందరకూ చాలా కాలం వరకూ, రాజశేఖర చరిత్రమే మార్గదర్శకంగా వున్నది కనుకనే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు నవల ఆయినదని ఈ నవలపై విమర్ననాత్మక గ్రంథం రాసిన రాసిన డా. అక్కిరాజు రమాపతిరావు గారు పేర్కొన్నాడు. ఈ నవలలో ఆనాడు సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, పంతులుగారు ఈ నవలలో వజ్రాభమైన తమ నిశిత బుద్ధిని చూపి, ఆవేశంతో చెండాడారని రమాపతిరావు తెలిపాడు. సుప్రసిద్ద నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయ చరిత్రలో తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రం చదివి, గ్రహించి, నేర్చుకున్నామని వ్రాసుకున్నారు.
Tags: Rajasekhara Charitramu, రాజశేఖర చరిత్రము, కందుకూరి వీరేశలింగం పంతులు, Kandukuri Veerasalingam Pantulu