Vaishnava Sakshi | వైష్ణవ సాక్షి
- Author:
- Pages:
- Year:
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Samskruti-సంస్కృతి
-
₹70.00
పానుగంటి లక్ష్మీనరసింహారావుపంతులుగారు సాక్షి వ్యాసాల రచయితగా ఆధునిక తెలుగు సాహిత్యాకాశంలో ధగధగ మెరిసేతార. సాక్షి వ్యాసాలలో వైష్ణవ సంబంధ వ్యాసాల సంకలనమే ఈ గ్రంథం.
కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలలో భక్తే ప్రధానమని, హరినెఱిగినవాడు ఏ కులజుడేమి, ఎవడైననేమి అని సర్వవర్ణాలను సమదృష్టితో చూసిన, చూడమని చెప్పిన విశిష్టాద్వైత మతప్రవర్తకుడు శ్రీరామానుజాచార్యులవారు. రామానుజులవారి కరుణార్ధ్రస్వభావం, వారు చెప్పిన, ఆచరించి చూపిన సర్వజనసమత, ఆండాళ్, తిరుప్పావైలాంటి గంభీరమైన కారణాలేకాక కనులకింపైన అలంకరణలు, రుచికరమైన ప్రసాదాలు విశిష్టాద్వైతంపట్ల అనురక్తి కలిగేటట్టు చేశాయి. అందుకు సాక్షి వ్యాసాలుకూడా దోహదపడ్డాయి. సాక్షి వ్యాసాలలో కలగాపులగంగా అక్కడక్కడా ఉన్న వైష్ణవ సంబంధ వ్యాసాలన్నింటినీ సంపుటి చేయాలనే యత్నమే ఈ ‘వైష్ణవ సాక్షి’గా రూపుకట్టింది.
-- సంపాదకుడు: మోదుగుల రవి కృష్ణ
పానుగంటి పంతులు శబ్దవైచిత్రవలచినకవి. ఆంధ్ర వచనరచనలో వీరొక క్రొత్తదారి త్రొక్కిరి. కందుకూరి వీరేశలింగము పంతులుగారు గద్యతిక్కనయేగాని యావిషయము వేఱు. చిలకమర్తికవి పెద్దనవలా రచయితేగాని యదియునువేఱే. పానుగంటివారి రచన మఱియొక విలక్షణమైనది. వీరు వ్యావహారికమునకు దగ్గఱగనుండు గ్రాంథికము వ్రాయుదురు. ప్రతిపదము పరిహాసగర్భితము. ఆక్షేపణ భరితము. చెప్పినదే మార్చి మార్చి భంగ్యంతరముగా జెప్పుట వీరి రచనలో గ్రత్తదనము. చదివినకొలదిని జదువుట కుత్సాహము పుట్టించు రచనమే రచనము. అది పానుగంటికవి సొమ్ము. విషయము గప్పిపుచ్చకుండ, విసుగుపుట్టింపకుండ వేలకొలది నిదర్శనముల జూపుచు వ్రాయుటలో బానుగంటి వారిదే పై చెయ్యి. పాఠకున కొకవిధమైన యుత్సాహము చిత్తసంస్కృతి యావేశము గలిగింపజేయుట కీయన రచన యక్కటైనది.
Tags: Vaishnava Sakshi, వైష్ణవ సాక్షి, పానుగంటి లక్ష్మీనరసింహారావుపంతులు, Panuganti Lakshmi Narasimha Rao