Lolakam | లోలకం
- Author:
- Pages: 220
- Year: 2026
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹200.00
An anthology of poems by Raghu
రఘు కవిత్వం
*********
కలలు
ఆత్మలు స్నానం చేసే చెరువులు
వాటిని అరకొర నిద్రలతో నింపొద్దంటాను
సరిపోని నిద్రలు
పొట్టిగుడ్డతో కుట్టిన జుబ్బాలంటాను
********
ప్రేమలో ఉన్నప్పుడు కళ్ళు స్థిరాకాశాల్లా కనబడి
ఇంకే కాంతిపుంజాలు వద్దంటాయి
సొరంగాల చీకట్లున్నా మిరమిట్లు గొలుపుతాయి
తూచలేని విశ్వాసం తొణికిసలాడి
ఇంద్రనీలాలు పట్టుదుప్పటిలా కప్పుకుంటాయి
కాలాన్ని కొమ్మ చేసి
కుదుపు కుదుపుకు తుళ్ళిపడే తుమ్మెదలౌతాయి
********
మనసనేది లేకుంటే మనం కేవలం
గడ్డి మేసే మందలం
వెన్నెల మింగని పక్షులం
అక్కడ మనం తలెత్తి చూడని అంతరిక్షం
ఎవరూ రాయని ప్రశ్నపత్రం
Tags: Lolakam, లోలకం, Seshabhattar Raghu, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్, 9788198296252


