Pujari 2040|పూజారి 2040

Pujari 2040|పూజారి 2040

  • ₹125.00

రాణి శివశంకరశర్మ కథలు

****

దోవలో ఎంతోమంది పలకరించారు. నిజమైన ఆత్మీయులు, సత్తెయ్య,

సోవాలమ్మ, వెంకమ్మ, ఎల్లయ్య... దొంగవేషాల్నీ, నటనల్నీ, మర్యాదల్నీ

చదువుకోని స్వచ్ఛమైన జనం.

ఎంత ప్రేమాస్పదమైన నేలమీదికి తిరిగివచ్చాను?

****

బిస్మిల్లాఖాన్‌ షెహనాయీ ఆడియో కేసెట్‌ తెచ్చిచ్చాడు ఇక్బాల్.

ఆ షెహనాయీ అతని చిరునవ్వూ కలిసి నాలో సరికొత్త సరిగమలు.

****

బలమే జీవలక్షణం అని నాకు తెలిసివచ్చింది. బలాత్కారం దాని

అనివార్య పర్యవసానం. బలహీనతే మరణం. నేను జీవించాలని కోరుకొన్నాను. అది నాకు ఆనంద్‌లో సాక్షాత్కరించింది.

****

తాము అడుగు పెట్టలేనిచోట అడుగు పెట్టినందుకు, తాము వినడానికి వీలులేని మంత్రాలు ఉచ్చరిస్తున్నందుకు, ఆలయప్రవేశమే నిషిద్ధమైనచోట- గర్భగుడిలోకి చొచ్చుకుపోగలుగుతున్నందుకు

సంతోషించాలా, గర్వపడాలా, లేక

తమదైన ప్రత్యేకమైన ఉనికిని కోల్పోయినందుకు ఏడవాలా?

****

“కానీ పురోగమించినవాళ్ళు వైరస్‌లా వ్యవహరిస్తే?”

నేను చాలా తెలివిగా ప్రశ్నించాను అనుకొన్నాను.

“మనిషే అసలు వైరస్‌, విస్తరించాలనే అతని కాంక్షని

నివారించగలిగింది లేదు” అన్నాడు మెకాలే శేషు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Pujari 2040, Rani Sivasankrasarma, పూజారి 2040, రాణి శివశంకరశర్మ, Analpa Book Company, అనల్ప బుక్ కంపెనీ, 9789393056450