Malayamaarutham|మలయమారుతం

Malayamaarutham|మలయమారుతం

  • ₹150.00

చాలామంది ఆడవాళ్ళు ఇతర స్త్రీలు ఏదైనా పొరబాటు చేయగానే, తాము ఎన్ని అవకాశాలొచ్చినా పొరబాట్లు చేయకుండా జాగ్రత్తగా వున్నామో చెప్పి చాలా వికృతమయిన ఆనందం పొందుతారు. శీలానికి సంబంధించిన పొరబాట్లయితే, వాళ్ళ ఆనందం మరీ ఎక్కువ.

తల్లి ప్రపంచంలోని నీతినియమాలూ, చట్టాలూ తన పిల్లలకి వర్తించకూడదనీ, వారే తప్పు చేసినా అందరూ మన్నించి ప్రేమించాలనీ కోరుకుంటుంది.

నేనెప్పుడూ అనుకోలేదు, నేనూ వేదిక ఎక్కి కచ్చేరీ చేస్తానని. అది నిజానికి చాలా చిన్న విషయం. కానీ దాని వెనక దాగిన నా ప్రయాణం, ఆ ప్రయాణంలో నేను నేర్చుకున్న విషయాలూ, అర్థం చేసుకున్న జీవితమూ ఎంత లోతైనవి! ఆ అనుభవాలతో పోల్చి చూసుకుంటే అంతకుముందు నేను గడిపిన దాదాపు ముప్ఫైఅయిదేళ్ళ జీవితమూ వేరే జన్మలాగ అనిపిస్తుంది.

ఉమ్మడి కుటుంబాల్లో ఏ బాధ్యతా మగవాళ్ళ దగ్గరికి రాదు. చిన్నపిల్లలవీ, వృద్ధులవీ, పనివాళ్ళవీ, ఏ సమస్యలూ అనారోగ్యాలూ ఏవీ వాళ్ళదాకా రావు. అందుకే వాళ్ళకా ఏర్పాటు నచ్చుతుందేమో మరి.

పెద్ద కష్టం వచ్చినప్పుడు మన ముందు రెండు దార్లుంటాయి కాబోలు. ఆ కష్టాన్ని పళ్ళ బిగువున సహిస్తూ, అది కష్టమే కాదని సర్దిచెప్పుకుంటూ సాగిపోవడం ఒక పద్ధతైతే, కష్టాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నించడం రెండో పద్ధతి.

మగాడు, 'మగతనం' లాటి మాటలు విచ్చలవిడిగా వినబడుతూ, ఎవరికీ అర్థంకాని ఒక టాక్సిక్‌ స్టిరియోటైపింగు వాడికెంత నరకం చూపించిందో! అలాటి అవహేళనలని ఒంటరిగా వాడెంత కాలంనించీ ఎదుర్కొంటున్నాడో!

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Malayamaarutham, Sarada, Analpa Book Company, మలయమారుతం, శారద, అనల్ప బుక్ కంపెనీ, 9789393056221