Nenu Naa Guruvu|నేను, నా గురువు

Nenu Naa Guruvu|నేను, నా గురువు

  • ₹300.00

గది లోపలికి అడుగుకూడా పెట్టకుండానే వెనక్కి తిరిగాను. కానీ ఆ గదిలో కూర్చుని ఉన్న బాబా, దత్తాత్రేయుడి అవతారం, ఇక నన్ను వదిలిపెట్టడు, సంవత్సరాల తరబడి నన్ను వెంటాడి నాకు పిచ్చి పట్టిస్తాడు అనే విషయం నేను ఆ క్షణంలో ఊహించలేక పొయ్యాను. “నీకు నిజంగానే శక్తులు ఉన్నాయా?” “ఒక నిదర్శనం చూపి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. నిదర్శనం చూపకపోవడం నా తప్పా నీ తప్పా?” (...) వీధి చివరి నించి పెద్దగా ఒక నవ్వు వినిపించింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే బాబా గట్టిగా నవ్వుతూ చేతులు ఊగిస్తూ, నన్ను తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. నేను “బాబా!బాబా!” అని కలవరిస్తూ ఒక జింకలా గంతులేస్తూ ఆయన దగ్గరికి పరిగెత్తాను. ఆయన ముందు మట్టిలో మోకాళ్ళ మీద వంగి కూర్చున్నాను. ఆ మసక వెలుతుర్లో నాకు మెరిసిపోతున్న ఆయన ముఖము తప్ప ఇంకేమీ కనబడడం లేదు. ఆయన ప్రసన్నంగా, వెలిగిపోతున్న కళ్ళతో నన్ను చూశాడు. ఆ క్షణంలో ఏదో ఒక శక్తి ఒక జలపాతంలా నాలోకి ప్రవహించి నన్ను ముంచెత్తింది...

ఆయన చూపు నన్ను ఒక మెరుపులా తాకింది. నేను వొణికి పొయ్యాను... ఆ క్షణంలో జరిగినదాని గురించి నేను ఎంతైనా చెప్పవచ్చు. కానీ ఏమి జరిగిందో, అది అర్థం అవడానికి నాకు నిజానికి ఒక నెలరోజులు పట్టింది. నెల తరవాత నాకు అప్పటి వరకు తెలీని సిద్ధపురుషులు కలలో కనబడి ఆదేశాలివ్వడం మొదలెట్టారు. అప్పుడు నాకో అనుమానం వచ్చింది - నాంపల్లి బాబా నాకు ఇచ్చిన అనుభవాన్ని శక్తిపాతం అంటారేమో అనుకున్నాను. హైకె టాక్సీలోకి ఎక్కే ముందు నానుంచి సెలవు తీసుకునేందుకు నాకు ముద్దు పెట్టింది– జర్మన్ సాంప్రదాయానికి అనుగుణంగా బుగ్గ మీద కాదు. గాఢమైన ఆలింగనంలో పెదాల మీద. ఆ రాత్రి ఎప్పుడో తెల్లవార పోయేముందు మంచం మీద పడుకున్నాను.

చాలాసేపటి తరవాత నా కళ్ళు మూతబడ్డాయి. ఆ క్షణం కోసమే రోజంతా ఎదురు చూసినట్లు నాంపల్లి బాబా హఠాత్తుగా నా ఎదుట నిలబడ్డాడు. ఆయన వెనక కొద్దిదూరంలో హైకె వితంతువు దుస్తులు వేసుకుని ఒక శిశువుతో ఉన్న స్ట్రోలర్ ని, తన పెట్టె బేడా దాని మీద వేసి, తోసుకుంటూ నా వైపుకి వస్తోంది. నాంపల్లి బాబా నన్ను మండిపడుతూ చూసి అన్నాడు: “ఈమె జోలికి పోవద్దు. ఈమెతో సంబంధం పెట్టుకున్నావంటే జాగ్రత్త! నేను నీకు ఇచ్చినది అంతా మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాను.” ఆయన అన్నంత పని చేశాడు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Nenu Naa Guruvu, నేను, నా గురువు, Gunturu Vanamali, 9788198296269, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్