Parimalaalu... Paraamarsalu|పరిమళాలు... పరామర్శలు
- Author:
- Pages: 162
- Year: 2026
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Astra Publishers | అస్త్ర పబ్లిషర్స్
-
₹200.00
మీరు ఏకీభవించినా, భవించకున్నా; తిట్టినా తిమ్మినా దైవం, దయ్యం
పరస్పర ఆశ్రితాలు. ఒకటి లేకపోతే మరొకటి లేదు.
**
అయ్యవారు నిషేధించిన పుష్పాన్ని అమ్మవారు అక్కున చేర్చుకొంది. తనకిష్టమైన పూజాపుష్పంగా స్వీకరించింది. తదాది నారీమణులు ‘భర్తమాటని వీటో చేయుట’ అనుదానిని శ్రీమంత్రంగా గ్రహించి యథాశక్తి ఉపాసన చేస్తున్నారు.
**
సచేలస్నానం - అంటే ఒంటిమీదున్న బట్టలతోనే స్నానం చేయటం - అంటే చాలా పెద్దమైల సోకినట్లు. అప్రవాసినం- అంటే యాత్రలు చేయనివాడు, దేశం తిరగనివాడు. అటువంటి అప్రవాసిని చూస్తే పెద్దమైల సోకినట్లు ఒంటిమీద బట్టలతోనే స్నానం చేయాలి.
**
‘అంత చిన్నకథను చదవటానికి యిన్నిరోజులా?’ అని అనుకోకుండా ఎదురుచూస్తున్న నరసింహారావు దోసిట్లో ఒక కట్ట ఉంచారు విశ్వనాథ. ‘నేనిచ్చిన కథ యిన్ని పుటలు లేదే! ఏమిటి సంగతి, చెప్మా’ అనుకొంటున్నారు మునిమాణిక్యం. విశ్వనాథ విశాలంగా నవ్వుతూ, “కథ బాగుంది, కాస్త పెంచి తిరగరాశాను. ఏమీ అనుకోకు” అన్నారు.
**
బిడ్డను తల్లినుండి వేరుచేయకూడదనే ప్రకృతిన్యాయాన్ని ఆచార్యులు గుర్తించినా; తల్లివద్దనే బిడ్డ పెరిగితీరాలి అనే ప్రకృతిధర్మాన్ని సరస్వతి అనుసరించినా వంశవృక్షం
అనే నవల (చలనచిత్రం) ముందుకు సాగేది కాదు.
**
మీ గురువులతో మీకున్న అనుబంధాన్ని రాసివ్వండని 22 మందిని అడిగాను.
ఈ 22 మందీ 30 నుండి 35 యేళ్ల లోపువాళ్లు. ఇద్దరు తప్ప అందరూ మంచి ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నవారే. కొంచెం హెచ్చూ తగ్గూగా అందరూ కూడబలుక్కున్నట్టు “అలాంటి అనుభూతులు, అనుభవాలు, గురుప్రేమ మాకు లేవు, తెలియదు.
ఫిజిక్సోడు, మాథ్సోడు, సాన్స్క్రిట్టోడు లాంటి సబ్జక్టోచిత నామాలే గాని,
మాకు పాఠాలు చెప్పినోళ్ళ పేర్లు కూడా గుర్తులేవు,” అన్నారు.
**
రచనకు యెంచుకున్న వస్తువుతోను లేదా కావ్యంలోని ఏదేని ఒక బలమైన పాత్రతోను ఎంతోకొంత 'ఆత్మీయత' కలిగి ఉంటేనే, తన రచనను రమ్యంగా తీర్చగలడు, రచయిత. దీనికిగాను ప్రాచీన కవిత్రయం నుండి, శ్రీశ్రీ చెప్పిన ఆధునిక కవిత్రయం వరకూ, విశ్వనాథ, జాషువా, శివసాగర్... ఒకరేమిటి, ఉదాహరణలు బోలెడు.
Tags: Parimalaalu... Paraamarsalu, పరిమళాలు... పరామర్శలు, Modugula Ravikrishna, 9788198296283, Astra Publishers, అస్త్ర పబ్లిషర్స్


