Sri Ramanuja Acharya Charitra|శ్రీ రామానుజా ఆచార్య చరిత్ర

Sri Ramanuja Acharya Charitra|శ్రీ రామానుజా ఆచార్య చరిత్ర

  • ₹150.00

శ్రీ రామానుజా ఆచార్య చరిత్ర

సముద్రాల వెంకట కృష్ణ

రామానుజులనగానే అందరికీ శ్రీవైష్ణవం తలపుకొస్తుంది. వైష్ణవమంటే, త్రిమూర్తులలోని విష్ణువునే దేవాధిదేవుడని నమ్మటమని తప్పుడు ఆభిప్రాయం బహుళ ప్రచురితం. శ్రీ వైష్ణవమంటే, వైష్ణవానికి మర్యాదగా శ్రీ తగిలించారని అనుకుంటారు. ‘విష్ణు’ అంటే సర్వత్రా వ్యాపించినది అని అర్థం, అది ఒక వ్యక్తికి అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. పురాణాల కట్టుకథలలో త్రిమూర్తులను వేరు వేరు వ్యక్తులుగా చిత్రించి, వాళ్ళ మధ్య పోటీలు, స్పర్థలు కల్పించడం, అందులో ఒకరైన విష్ణువును ఆరాధించేవాళ్ళే వైష్ణవులనటం మూఢనమ్మకం, మూఢ తర్కం. ‘విష్ణు’ అన్నది ఒక లక్షణం. ఆ లక్షణాన్ని తెలుసుకోడమే వైష్ణవం. విశిష్ఠాద్వైతం(విఅ) ను ‘శ్రీవై’ అని వ్యవహరించటం అవగాహనారాహిత్యపు ఆనవాయితి. చరిత్ర కారులు విఅ రామానుజులు స్థాపించినదంటారు. అది చరిత్రకారులకు అలవాటుగా మారిన పొరపాటు. ‘విఅ’ రామానుజలస్థాపన కాదు. ద్వైతం ఆస్తిక వాదాలలో స్వాభావిక ఉత్పత్తి. అద్వైతం వేళ్ళూనుకొంటున్న బోధివృక్షాన్ని కూకటివేళ్ళతో పెకలించి, రెండు వర్ణాల కుహనాధిక్యతకు ఊతకర్రగా పాతిన మాయాదండం. ‘విఅ’ ఏ మతమునూ, వాదాన్ని కూలదోయడానికుద్దేశించినది కాదు. దీని స్ఫూర్తి సృష్టికర్త తలపులోనుంచి గీతామృతధారగా విశ్వానికి చేరింది. అంచేత అది ద్వైతమంత అనాది.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Sri Ramanuja Acharya Charitra, Samudrala Venkata Krishna, శ్రీ రామానుజా ఆచార్య చరిత్ర, సముద్రాల వెంకట కృష్ణ, 9788192767956, Arts & Letters, ఆర్ట్స్ & లెటర్స్