Sthanam Narasimharao Nata Jeevana Prasthanam | స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం
- Author:
- Pages: 146
- Year: 2013
- Book Code: Paperback
- Availability: In Stock
- Publisher: Kalatapasvi Creations-కళాతపస్వి క్రియేషన్స్
₹160.00
₹200.00
"నాటకావతంస" స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం
ఒక్కొక్కప్పుడు పరస్పర విరుద్ధమయిన – పాత్రలను ధరించి, ధరించిన ప్రతి పాత్రలోను తనదైన ప్రత్యేకతను చూపించి ముప్ఫయి సంవత్సరాలపాటు లక్షలాదిమంది ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన ప్రతిభ ఆయనది. నటకావతంస, నటశేఖర, నాటకకళా ప్రపూర్ణ, పద్మశ్రీ వంటి బిరుదులు, పురస్కారాలు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సత్కారాలకు, అశేష ఆంధ్రావని నిరాజనాలు పలకడానికి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి తాను చేస్తున్న పనిలో నిమగ్నత, రెండు ఆ పనిమీద భక్తి ప్రపత్తులు. తన వృత్తి యెడల అంతటి గాఢమైన మమకారం. గురువులు చెప్పిన సూత్రాలను తన చిత్తవృత్తికి అనుగుణంగా మార్చుకొని మసలుకోవడం, ఏ పాత్ర చేస్తున్నా దాని పూర్వాపరాలను కూలంకషంగా అధ్యయనం చేయడం నటుని ప్రాధమికమైన అవసరాలుగా గుర్తించి పాత్రల కదలికలను, హొయలను, కోపాన్ని, తాపాన్ని – యిలా పాత్రోచిత భావ వైవిధ్యాన్ని మననం చేసుకొని అమలుపరచడం స్థానం నటజీవన విశిష్టత. నాటకరంగానికే జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడాయన. - మొదలి నాగభూషణశర్మ
Tags: Sthanam Narasimharao Nata Jeevana Prasthanam, స్థానం నరసింహారావు నట జీవన ప్రస్థానం, ఆచార్య మొదలి నాగభూషణ శర్మ, Modali Naghabhushana Sarma