Swara Lahari | స్వర లహరి

Swara Lahari | స్వర లహరి

  • ₹120.00

    ₹150.00

సుప్రసిద్ధ సంగీతదర్శకుల వ్యాసమాలిక 

సంకలనం: కాంపల్లె రవిచంద్రన్

పి.బి.శ్రీనివాస్ ప్రతివాద భయంకరులు. ఇంటి పేరు నిలబెట్టిన మేధావి. సంగీతం ఆయన తూణీరంలో ఒక పార్శ్వం మాత్రమే. ఎన్నో భాషలలో అఖండమయిన పాండిత్యాన్ని ఆపోశన పట్టిన రచయిత. అందుకు ఆయన “ప్రణవం” ఒక్క ఉదాహరణ చాలు. చిత్రకవితలకు, సాహిత్యంలో సరికొత్త సాముగరిడీలకు ఆయన పెట్టింది పేరు. కొత్త రాగాలనూ, కొత్త వృత్తాలనూ విచిత్రగతులలో రూపొందించిన ఘనుడు. నా షష్టిపూర్తికి శ్రీనివాస మారుతీ వృత్తాన్ని దాదాపు 40 పంక్తుల కవితను రాశారు. ఎప్పటికప్పుడు కొత్తదనం, కొత్త మాట, కొత్త గమకం, కొత్త ఆలోచన ఆయనన్ని ఉర్రూతలూగిస్తుంది. పసివాడిలాగ పరవశింపజేస్తుంది. ఆయన మస్తిష్కాన్ని రెచ్చగొడుతుంది. ఒక్కోసారి ఆయన ఆలోచనకు భాష పరిధులు సరిపోవు. కొత్త మాటల్ని, కొత్త ప్రయోగాల్ని సృష్టించుకుంటారు. శ్రీనివాస్ గారి మరొక గొప్ప అదృష్టం – ఏ రంగంలో, ఏ వ్యక్తి తన పరిణితిని ప్రదర్శించినా ఆయన పసివాడిలాగ తన్మయులవుతారు. నాకు మెహదీ హసన్, గులాం అలీ గజల్స్ ను పరిచయం చేసిన రసికుడు. ఆయన రాసిన ఎన్నో గజల్స్ కి నేను మొదటి శ్రోతని. ఆర్ద్రత ఆయన జీవలక్షణం. ఎప్పటికప్పుడు తనకు తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, ప్రతీ కొత్తదనంలోనూ కొత్త స్ఫూర్తిని సంతరించుకుంటూ జీవితాన్ని నిత్యనూతనం చేసుకున్న చరితార్థుడు, మిత్రులు శ్రీనివాస్. శరీరానికి వృద్ధాప్యం వచ్చినా ఆలోచనల్లో యౌవనానికి ఎప్పటికప్పుడు నీరెత్తిన కృషీవలుడు. అనునిత్యం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన కళలో ఆవిష్కరించుకుంటూ, జీవితంలో కొత్త ప్రపంచానికి స్వాగతం పలికే నిత్యనూతనుడు ఏనాటికీ అలసిపోడు. అందుకు అరుదైన ఉదాహరణ ప్రతివాద భయంకర శ్రీనివాసాచార్యులు.

- గొల్లపూడి మారుతీరావు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Swara Lahari, స్వర లహరి, పి.బి.శ్రీనివాస్, P B Srinivas