Tamilanata Telugunudi Pallekatalu|తమిళనాట తెలుగునుడి పల్లెకతలు

Tamilanata Telugunudi Pallekatalu|తమిళనాట తెలుగునుడి పల్లెకతలు

  • ₹99.00

తమిళనాట తెలుగునుడి పల్లెకతలు

సేకరణ: డా|| సాగిలి సుధారాణి   Compiled by: Dr. Sagili Sudharani

అతి ప్రాచీనకాలం నుంచి తమిళనాడులో లక్షలాదిగా తెలుగువారు నివసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో జిల్లాకొక తీరున మాండలికం ఉన్నట్లే తమిళనాడులో కూడా దాదాపు ప్రతి జిల్లాలోను తెలుగు మాండలికాలు వేరుగా ఉంటాయి. తమిళనాడు తెలుగులో మనకు తెలియని అనేక పల్లెకతలతో పాటు మనము వినబడిన తెలుగు కథలు కూడా వారు చెప్పే కథల్లో ఉంటాయి. భాష పేరుతో రాష్ట్రాలను విడగొట్టిన సర్కారు పుణ్యమా అని తమిళనాట తెలుగువారిలో అధికశాతం మందికి తెలుగు చదవడం గాని, వ్రాయడంగాని రాకుండా పోయింది. వాళ్ళను పట్టించుకొనే పెద్దలు లేకపోయినా వాళ్ళ నాలుకలపై తెలుగు సజీవంగా బతికే ఉందనడానికి ఈ పల్లెకథలే నిదర్శనం. వీరి తెలుగు తమదైన సొంత ప్రాచీన పద్ధతిలో ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల పూర్వం తెలుగుభాషలోని పదాలను అలాగే పలుకుతున్నారు. అంటే వీరు మన తెలుగు పదాల స్వరూపాన్ని అలానే నిలుపుకొని ఉన్నారు. అదే సమయంలో తమిళభాష మూల లక్షణాలు కొన్ని ఆనాటి తెలుగుభాషను ప్రభావితం చేసాయి. తమిళనాట తెలుగువారి నోళ్ళలో నానుతున్న కథలను ఉన్నది ఉన్నట్టే, విన్నది విన్నట్టే పొల్లుపోకుండా వింటూ రాసాను. ఈ కథలు ప్రధానంగా దక్షిణ తమిళనాడు తెలుగు మాండలికంలో ఉన్నాయి.

సేకరణ: డా|| సాగిలి సుధారాణి   Compiled by: Dr. Sagili Sudharani

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Tamilanata Telugunudi Pallekatalu, తమిళనాట తెలుగునుడి పల్లెకతలు, సేకరణ: డా. సాగిలి సుధారాణి, Compiled by: Dr. Sagili Sudharani, Arts & Letters, ఆర్ట్స్ & లెటర్స్, 9788192767994