జగద్గురు ఆదిశంకరాచార్య
అద్వైత మతస్థాపకులు ఆదిశంకరులు భక్తి జ్ఞాన 'ప్రబోధకములైన కృతులు అనేకం రచించారు. సౌందర్య పా శివానందలహరి, ప్రబోధసుధాకరం కూడా అటువంటి విశిష్ట రచనలలో ఒకటి. అద్వైత వేదాంత సారాన్ని అత్యంత "సరళమైన రీతిలో అందులో పొందు పఫరచటమేకాదు, ముక్తిదాయకమైన కృష్ణభక్తి తత్వాన్ని అమిత హృద్యంగా చిత్రించారు.
కల్లూరి వేంకట స సుబ్రహ్మణ్య దీక్షితులు
శ్రీశ్రీ శ్రీ కంచి పరమాచార్యను ఆజీవన వ్రతంగా సేవించు కుంటూ ధన్యతను పొందిన శ్రీ కల్లూరి వేంకట స సుబ్రహ్మణ్య దీక్షితులు కవిగా, విద్వద్వరేణ్యులుగా సుప్రసిద్దులు. అష్టాదశ _ పురాణాలను ఆంధ్రీకరించారు. నారాయణీయం, మూకపంచశతి, ఆర్యాద్విశతి, తేటగీత తదితర అనువాద రచనలు వెలయించారు. పరమాచార్య స్తుతి ప్రధానంగా సంస్క తంలో “గురుకృపాలహరి కావ్యాన్ని విరచించారు. “'గురుశిశుగా తనను తాను అభివర్ణించుకున్న దీక్షితులుగారి స్వస్థలం గోదావరీ తీరస్థ 'ప్రక్కిలంక గ్రామం.
దేవళ్రాజు శ్రీమహా విష్ణు
వృత్తిరీత్యా ఇంజనీరు అయిన శ్రీమహావిష్టు ప్రవృత్తిరీత్యా. సంస్కృత ఆంధ్రా ఆంగ్ల భాషావిశారదులు తమ గురువర్యులైన కల్లూరి వేంకట స సుబ్రహ్మణ్య దీక్షితులవారు రచించిన గురుకృపాలహరి కావ్యాన్ని శంకరకృత 'ప్రబోధసుధాకరాన్ని ఆంగ్లంలోనికి. అనువధించారు. 'ఫండమెంటల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంద్ అదర్ ఎస్సేస్' వీరిది మరొకరచన. ఇప్పుడు దీక్షితులుగారి 'ప్రబోధసుధాకర ఆంధ్రానువాదాన్ని పరిష్కరించి వ్యాఖ్యాన సహితంగా అందిస్తున్నారు.
Tags: Prabodha Sudhakaram, ప్రబోధ సుధాకరము, Kalluri Venkata Subrahmanya Deekshitulu, Kalluri Venkata Subrahmanya Deekshitulu