Cinigitha Sarvasvam-5 Volumes Set  |  సినీగీత సర్వస్వము -ఐదు సంపుటాలు

Cinigitha Sarvasvam-5 Volumes Set | సినీగీత సర్వస్వము -ఐదు సంపుటాలు

  • ₹1,045.00

సి.నా.రె. గా పేరొందిన సింగిరెడ్డి నారాయణరెడ్డిగారు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపన్యాసకులుగా ఉంటూనే 1962లో శ్రీ నందమూరి తారక రామారావుగారి ఆహ్వానంపై చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. వారి తొలి సినీగీతం – ‘‘నన్ను దోచుకొందువటే’’. ‘గులేబకావళి కథ’ చిత్రంలోని పాటలన్నీ వారు వ్రాసినవే. ఆనాటి ‘గులేబకావళి కథ’ చిత్రం నుండి ఇటీవలి ‘అరుంధతి’, ‘మేస్త్రీ’ సినిమాల వరకు, నారాయణరెడ్డిగారు మూడున్నర వేలకు పైగా సినిమా పాటలు రచించి, చలనచిత్ర జగత్తులో తమ ప్రత్యేకతను భద్రపరచుకున్నారు. పాటలు రచించడమే కాదు ‘పాటలో ఏముంది నా మాటలో ఏముంది’ – అనే శీర్షికతో వారు తమ పాటలకు సంబంధించిన అనేక విషయాలను గూర్చి వ్యాఖ్యానాలు వ్రాశారు. ఆ వ్యాఖ్యానాలు రెండు పెద్ద గ్రంథాలుగా ప్రచురితమయ్యాయి. వారి పాటలు సాహిత్య మూల్యాలను పోషించాయి.  నారాయణరెడ్డిగారు ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలీ’ అనే రెండు చిత్రాలకు సంభాషణలు కూడా రచించారు. వారు 50 మందికి పైగా సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. ఆ సంగీత దర్శకులలో తెలుగువారే కాక శంకర్ జయకిషన్, సి. రామచంద్ర, ఓ.పి. నయ్యర్, రవీంద్రజైన్, ఉషాఖన్నా, బప్పీలహరి – వంటి ప్రముఖ హిందీ సంగీత దర్శకులు కూడా ఉన్నారు. ఘంటసాల గళంలో నారాయణరెడ్డి గీతాలధికంగా వచ్చాయి. వారి చలన చిత్ర గీతాలపై, ప్రముఖ సాంస్కృతిక సంస్థలు, అనేక సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. నారాయణరెడ్డిగారి చలనచిత్ర గీతాలెన్నో బహుమతులందుకున్నాయి. నారాయణరెడ్డిగారు – మూగజీవులు, శభాష్ పాపన్న, మొగుడా పెళ్ళామా, తూర్పు పడమర చిత్రాలలో కావ్యసంబంధమైన పాత్రలలో కనిపించారు. నారాయణరెడ్డిగారు చిత్రగీతాలు వ్రాయడమే కాదు, విలక్షణమైన తమ గళంతో తమ బాణీలో పాడగల ప్రతిభావంతులు.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Cinigitha Sarvasvam, సినీగీత సర్వస్వము, సి.నా.రె., సింగిరెడ్డి నారాయణరెడ్డి, Dr. C. Narayana Reddy