Desabhakta Konda Venkatappaiah | దేశభక్త కొండ వెంకటప్పయ్య

Desabhakta Konda Venkatappaiah | దేశభక్త కొండ వెంకటప్పయ్య

  • Author: దేశభక్త కొండ వెంకటప్పయ్య | Desabhakta Konda Venkatappaiah,
  • Pages: 304
  • Year: 2016
  • Book Code: Paperback
  • Availability: In Stock
  • Publisher: Samskruti-సంస్కృతి
  • ₹250.00

స్వీయచరిత్ర - మరికొన్ని రచనలు

ఎందుకు ఈ పుస్తకం ?

అందరికీ ఒప్పుదల అయినా కాకపోయినా భారతజాతి గాంధీజీ నాయకత్వాన నడిచింది. ఆయన కదలమంటే కదిలింది. 'ఖడేరావ్‌' అంటే ఆగింది. మహాత్ముని ప్రతి తలపోతకి తలవొగ్గింది. ఆయన ఒక్క సంవత్సరంలోగా స్వరాజ్యం వస్తుంది అంటే నమ్మింది. అవతార పురుషునిగా ఆరాధించింది.

మతం, కులం, భాష; ఇవి వందలాదిగా ఉండి ఎవరికి వారే యమునా తీరేగా ఉండవలసిన భారతజాతిని ఏకతాటిన నిలిపిన ఖ్యాతి నిస్సందేహంగా గాంధీజీదే. ఈ పనిలో ఆయనకు ఆసేతుశీతనగమూ ఉన్న మేరునగధీరులవంటి అనుచరగణం తోడ్పడింది. ఆంధ్ర రాష్ట్రంలోని అటువంటి వారిలో అగ్రగణ్యుడు కొండ వెంకటప్పయ్య. ఆంధ్రలో ప్రసిద్ధి నాయకగణం యింకా కన్ను తెరవకముందే గాంధీజీ అనుయాయి అయ్యారు వెంకటప్పయ్య. ఇంకా చెప్పాలంటే గాంధీజీ సిద్ధాంతాలు కొన్నింటిని - గాంధీజీ యింకా వాటిని ప్రచారంలోకి పెట్టకమునుపే ఆచరించి చూపినవాడు వెంకటప్పయ్య. కొండ వెంకటప్పయ్య వంటివారు ఎందరు గాంధీజీ పథాన నిలబడితే దేశం స్వాతంత్య్రపథాన నడవగలిగిందో యిప్పటి యువత అర్థం చేసుకోవటం లేదు. 

ఒక మహా నాయకుడి విజయం వెనుక ఎందరు ఉండి ఉంటారో తెలుసుకోవాలంటే కొండ వెంకటప్పయ్య జీవితం చదవాలి.

ఎందరు తమ అస్తిత్వాన్ని తగ్గించుకొంటే ఒక మహానాయకుడి ప్రభ జ్వాజ్వల్యమానంగా వెలుగుతుందో తెలుసుకోవాలంటే వెంకటప్పయ్య జీవితం చదవాలి.

తన వలన పైకొచ్చినవారే తనని తప్పుకోమని అడిగేస్తే, తను రూపుదిద్దిన వ్యవస్థల నుండి నాయకుడు ఎలా నిర్లిప్తంగా తప్పుకొంటాడో తెలుసుకోవాలంటే వెంకటప్పయ్య జీవితం చదవాలి.

వెంకటప్పయ్యది సంపూర్ణ జీవితం. ప్రజాసేవలో నిమగ్నమైన ధర్మదీక్షాయుత జీవనం. దేశసేవ ఆయన ఆదర్శం. గౌరవాలు, బిరుదులు ఏనాడూ ఆశించలేదు. దాపరిక మెఱుగని సత్యసంధత, మాయమర్మము లెఱుగని శీలం - ఆయన సొత్తు.

ఆంధ్రరాష్ట్రంలో స్వరాజ్య సమరసేనాని, ఆంధ్రరాష్ట్ర ఉద్యమ పితామహుడు - అప్పుడే మన విస్మృతికి గురి అవటం బాధాకరం. తన జాతిలోని వీరులను పూజించుకోని, స్మరించుకోని జాతికి అభ్యుదయం కల్ల.

ఏ సబ్జెక్టు చదివేవారైనా, ఏ రంగంలోనివారైనా దేశ చరిత్ర, సాహిత్యం గురించి కొద్దిమేరకైనా అవగాహన కలిగివుండటం చాలా అవసరం.

అందుకే - 

స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్రలో చెలరేగిన ఉద్యమాలన్నింటిలోనూ  శిఖరాగ్రస్థానం వహించిన కొండ వెంకటప్పయ్య కృషిని, ఆయన సార్థక జీవనాన్ని ఈ పుస్తకం ద్వారా ఆంధ్రలోకానికి పున:స్మరణకు తేవటమే మా సంకల్పం.


సఱ్ఱాజు బాలచందర్‌

   వ్యవస్థాపకులు

       సంస్కృతి

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Desabhakta Konda Venkatappaiah, దేశభక్త కొండ వెంకటప్పయ్య, స్వీయచరిత్ర