Budugu | బుడుగు(ముళ్ళపూడి వెంకటరమణ)

Budugu | బుడుగు(ముళ్ళపూడి వెంకటరమణ)

  • ₹100.00

బుడుగుముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన ఒక హాస్య రచన. ముళ్ళపూడి వ్రాతలు, బాపు బొమ్మల ద్వారా హాస్యపూర్వకంగా బుడుగు అనే పిల్లవాని భాష, అల్లరి, ఆలోచనలు, ప్రవర్తన ఈ పుస్తకంలో చెప్పబడ్డాయి. తెలుగు సాహిత్యంలో ఈ తరహా పుస్తకాలలో ప్రసిద్ధమైంది ఇదొక్కటే అనవచ్చును.

ముళ్ళపూడి రచనలు "ముళ్ళపూడి సాహితీ సర్వస్వం" అనే సంపుటాలుగా లభిస్తున్నాయి. అనువాద రమణీయం, సినీరమణీయం, బాలరమణీయం, కదంబ రమణీయం ఇలా. ఇందులో 3వ సంపుటం "బాలరమణీయం" బుడుగు. ఇది ఎమ్బీఎస్ ప్రసాద్ సంపాదకత్వం (ముందుమాట) తో వెలువడింది. ఈ రచన ప్రశంస ఆరుద్ర కూనలమ్మ పదాలులో ఇలా ఉంది.

హాస్యమందున అఋణ
అందె వేసిన కరుణ
బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మా!

బుడుగు ఎన్నటికీ ఏడేళ్ళ చిచ్చరపిడుగు గానే పాఠకుల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆ పాత్రను అద్భుతంగా చిత్రించిన ముళ్ళపూడి వెంకట రమణకి, రమణ భావనలో పుట్టిన బుడుగు ఆకారాన్ని అత్యంత ఆకర్షణీయంగా మన కళ్ళముందు ఉంచిన బాపుకి సార్థకత.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Budugu, బుడుగు, ముళ్ళపూడి వెంకటరమణ, బాపు, హాస్య రచన, బాలరమణీయం