Uttama Telugu Vaana Kathalu | ఉత్తమ తెలుగు వాన కథలు

Uttama Telugu Vaana Kathalu | ఉత్తమ తెలుగు వాన కథలు

  • ₹245.00

 సంపాదకత్వం: మహమ్మద్ ఖదీర్ బాబు

విత్తనం బొజ్జలో నుంచి మొక్క పాపాయిని నేల పొత్తిళ్ళలోకి తెచ్చి, పెంచి పెద్దచేసే దేవతే కదా వానంటే. మేఘాలు వెండి దారాలతో భూమికి ఆకుపచ్చని జీవాన్ని నేయడమే కదా వానంటే. ప్రకృతి పసి పాపాయై చేసే అల్లరి చప్పుళ్లే కాదు, కోపంతో ముఖం చాటేసి నిర్దాక్షిణ్యంగా జీవితాల్ని చిదిమి పారేసే మృత్యువు కూడా వానే. ఆనందం, ఆశ్చర్యం, భయం, బీభత్సం, విషాదం, దుఃఖం వానకున్న అనేక ముఖాలు. కళ్ళకు కనిపించే ప్రాణులతో పాటు, కనిపించని కోట్లాది జీవరాశుల బతుకులు శాసించేదే వాన. అలాంటి వాన నేపథ్యంలో తెలుగులో అనేకానేక కథలు వచ్చాయి. అందులో గుండెలు తడి చేసి, ఆలోచనలను తడిమే కథలన్నీ ఒక దరికి చేరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ పుస్తకం.

కథలు ఎంపిక చేసింది, వాటిని ఒద్దికగా కూర్చింది, రచయితల అనుమతులు, దివంగత రచయితల వారసుల అంగీకారములు తీసుకున్నది, సర్వం తానైనది ప్రముఖ రచయిత మహమ్మద్ ఖదీర్‌బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే కల ఖధీర్‌ది, ఆవిష్కరించినది ఛాయా. మాకు తెలిసి తెలుగులో ఒక రుతు స్పర్శను నేపథ్యంగా చేసుకొని కథాసంకలనాలు వచ్చిన జ్ఞాపకం లేదు. అలాంటిది ఇది మొదటిది అయితే గనక అంతకుమించిన ఆనందం లేదు. ఇందుకు సహకరించిన ప్రతీ రచయితకీ, వారసులకీ, తమ వంతు సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఖదీర్‌కి ఏమి చెప్పినా మాకు మేము చెప్పకున్నట్టే! ఈ సంకలనం మా రెండో ప్రచురణగా రావడం చాలా గర్వంగా ఉందని డప్పు కొట్టి మరీ చెబుతున్నాము. మీరు కూడా అవును అంటారనుకుంటున్నాము.

- కృష్ణ మోహన్‌బాబు

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Tags: Uttama Telugu Vaana Kathalu, ఉత్తమ తెలుగు వాన కథలు, మహమ్మద్ ఖదీర్ బాబు, Mohammed Khadeer Babu